Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలాంటి సమాచారమూ లేదన్న ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్
- బీజేపీ కుట్రగా అభివర్ణన
రాంచీ : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ అనర్హత వేటును ఎదుర్కోనున్నారని అనేక మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి. ఎమ్మెల్యేగా సోరెన్‌పై అనర్హత వేటు వేయాలని గవర్నర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నివేదిక ఇచ్చినట్టుగా కథనాల్లో తెలిపాయి. అయితే దీనిపై తనకు ఎలాంటి సమాచారమూ లేదని హేమంత్ సోరెన్ గురువారం తెలిపారు. ఇదంతా బీజేపీ కుట్రగా ఆయన విమర్శించారు. స్టోన్ చిప్స్ మైనింగ్ లీజును తన పేరున సొరెన్ పొందారంటూ గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9ఏ ను సొరెన్ ఉల్లంఘించారనీ, అనర్హత వేటు వేయాలని గవర్నర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నివేదిక ఇచ్చినట్టుగా కథనాల్లో తెలిపాయి. అయితే దీనిపై తనకు ఎలాంటి సమాచారమూ లేదని హేమంత్ సోరెన్ గురువారం తెలిపారు. ఇదంతా బీజేపీ కుట్రగా ఆయన విమర్శించారు. స్టోన్ చిప్స్ మైనింగ్ లీజును తన పేరున సొరెన్ పొందారంటూ గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9ఏ ను సొరెన్ ఉల్లంఘించారనీ, ఆయనపై అనర్హత వేటువేయాలని ఈమేరకు బీజేపీ కొన్ని రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నది. ఈ నేపథ్యంలో సొరెన్‌ను తొలగించాలని గవర్నర్‌కు ఈసీ నివేదిక ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.