Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాసనసభ సభ్యత్వం రద్దు
న్యూఢిల్లీ : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గనుల కేటాయింపు వ్యవహారంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన శాసనసభ సభ్యత్వాన్ని గవర్నర్ రద్దు చేశారు. ఎన్నికల కమిషన్ సూచనమేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోరెన్ ఎమ్మెల్యే హోదా కోల్పోయారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో సీఎం సోరెన్‌కు సంబంధాలున్నట్టు తేలినందున ఆయన ఎమ్మెల్యే పదవి రద్దు చేయాలని ఎన్నికల సంఘం గవర్నర్‌కు సూచించింది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ ఆదేశాల జారీ చేశారు. శాసనసభ సభ్యత్వం రద్దయినా..సోరెన్ సీఎంగా కొనసాగవచ్చు. యూపీఏ మిత్రపక్షాలు ఆయనకు మద్దతు తెలిపితే సరిపోతుంది. అయితే మరో ఆరు నెలల్లోగా ఆయన శాసనసభకు తిరిగి ఎన్నిక కావాల్సి ఉంటుంది. తాజా పరిణామాల అనంతరం..సీఎం హేమంత్ సోరెన్ శుక్రవారం యూపీఏ ఎమ్మెల్యేలతో తన నివాసంలో సమావేశమయ్యారు. సోరెన్‌పై అనర్హత వేటు పడినా..జార్ఖండ్‌లో యూపీఏ సర్కార్‌కు ఢోకా లేదని కాంగ్రెస్ నేత, మంత్రి అలంగీర్ ఆలమ్ అన్నారు. 81 సభ్యుల అసెంబ్లీలో విపక్ష బీజేపీకి 28 మంది సభ్యులున్నారని, తమ కూటమికి మ్యాజిక్ ఫిగర్‌ను మించి సీట్లున్నాయని చెప్పారు. అనర్హత వేటుపడ్డా..హేమత్ సోరెన్ సీఎంగా కొనసాగుతారని వ్యాఖ్యానించారు. జేఎంఎం అధికార ప్రతినిధి సుప్రీయో భట్టాచార్య మాట్లాడుతూ...ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్కార్‌ను కూల్చేందుకు బీజేపీ కుట్రలు మొదలయ్యాయని విమర్శించారు.