Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో 8..యూపీలో 4 : యూజీసీ
- విద్యార్థులు జాగ్రత్త..వీటిలో చేరొద్దు..
న్యూఢిల్లీ : దేశంలో 21 నకిలీ యూనివర్శిటీలున్నాయని, వీటి నుంచి జారీచేసే విద్యార్హత పత్రాలేవీ చెల్లుబాటు కావని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. శుక్రవారం ఫేక్ వర్సిటీల జాబితాను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ 'హైయ్యర్ ఎడ్యుకేషన్ బాడీ' విడుదల చేసింది. ఈ సంస్థలు ఆఫర్ చేసే ఉన్నత విద్యా కోర్సుల్లో విద్యార్థులెవరూ చేరవద్దని, దీనిని గమనంలో ఉంచుకోవాలని దేశ ప్రజలను, విద్యార్థులను యూజీసీ కోరింది. ఉన్నత విద్యా కోర్సులు, డిగ్రీలు ఆఫర్ చేయడానికి ఫేక్ వర్సిటీలకు అధికారం లేదని తెలిపింది. యూజీసీ చట్టానికి విరుద్ధంగా పనిచేస్తున్న 21 ''స్వీయ తరహా, గుర్తింపు లేని సంస్థల'' పేర్లను మీడియాకు విడుదల చేసింది. వీటిని నకిలీ విశ్వవిద్యాలయాలుగా ప్రకటిస్తున్నామని, ఎటువంటి డిగ్రీని ప్రదానం చేసే అధికారం ఈ సంస్థలకు లేదని ఉత్తర్వుల్లో తెలిపింది. ఈ విషయం దేశవ్యాప్తంగా విద్యార్థులు, ప్రజలు తెలుసుకోవాలని పేర్కొన్నది. యూజీసీ ప్రకటించిన నకిలీ యూనివర్శిటీల జాబితా ప్రకారం, ఢిల్లీలో 8, ఉత్తరప్రదేశ్లో 4, పశ్చిమ బెంగాల్లో 2, ఒడిషాలో 2, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిల్లో ఒక్కొక్కటి ఫేక్ వర్సిటీలున్నాయి.