Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయంపై ఆధారపడిన వారు 10,881 మంది...
- 5,318 మంది రైతులు..వ్యవసాయ కార్మికులు 5,563 మంది
- నిరుద్యోగులు 13,714, విద్యార్థులు 13,089 మంది ఆత్మహత్య
- పేదరికంతో 1,779 మంది ఆత్మహత్య : ఎన్సీఆర్బీ రిపోర్టు వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో ఆత్మహత్యలు పెరిగాయని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తెలిపింది. ఈ మేరకు దేశంలోని నేరాలపై ఎన్సీఆర్బీ నివేదిక విడుదల చేసింది. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు 2020లో 12,118 ఉండగా, 2021లో 15,781 పెరిగాయి. నేరాల రేటు 2020లో 1.8 ఉండగా, 2021లో 2.4కి పెరిగింది. చిన్నారులపై దాడులకు సంబంధించి 2020లో 50,276 కేసులు నమోదు కాగా, 2021లో 57,522 కేసులు పెరిగాయి. నేరాల రేటు కూడా 11.3 నుంచి 13.0కి పెరిగింది. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించి 2020లో 4,680 కేసులు నమోదు కాగా, 2021లో 5,617 కేసులు నమోదయ్యాయి. నేరాల రేటు కూడా 1.5 నుంచి 1.8కి పెరిగింది. రాజద్రోహం కేసులు 76 నమోదయ్యాయి. యూఏపీఏ కేసులు 2020లో 796 నమోదు కాగా, 2021లో 814 నమోదు అయ్యాయి. 2021లో మొత్తం రూ.20,39,29,260 విలువ గల 3,10,080 నకిలీ కరెన్సీ నోట్లను సీజ్ చేశారు. 2020లో 1,53,052 (11.3 రేటు)మంది ఆత్మహత్యలకు పాల్పడగా, 2021లో 1,64,033 (12 రేటు)మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 7.2శాతం ఆత్మహత్యలు పెరిగాయి. ఇందులో పురుషులు 1,18,979 మంది, 45,026 మంది మహిళలు, 28 మంది ట్రాన్స్ జండర్స్ ఉన్నారు. ఆత్మహత్యల రేటు నగరాల్లో 16.1 (ప్రతి లక్ష మంది జనాభాకు) ఉంది. ఇది జాతీయ సగటు రేటు (12) కంటే ఎక్కువగా ఉంది. కుటుంబ సమస్యలతో 33.2శాతం, వివాహానికి సంబంధించినది సమస్యలతో 4.8శాతం, అనారోగ్యం సమస్యతో 18.6శాతం ఆత్మహత్యలు చేసుకున్నారు.వ్యవసాయరంగంపై ఆధారపడిన వారు 10,881 (6.6 శాతం)మంది ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 5,318 మంది రైతులు కాగా, అందులో 5,107 మంది పురుషులు, 211 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 4,806 మంది సొంత భూమి సాగు చేసే రైతులు కాగా, అందులో 4,627 మంది పురుషులు, 179 మంది మహిళలు ఉన్నారు. 512 మంది కౌలు రైతులు, అందులో 480 మంది పురుషులు, 32 మంది మహిళలు ఉన్నారు. వ్యవసాయ కార్మికులు 5,563 మంది, అందులో 5,121 మంది పురుషులు, 442 మంది మహిళలు ఉన్నారు. పేదరికంతో 1,779 మంది ఆత్మహత్య చేసుకోగా, అందులో 1,535 మంది పురుషులు, 244 మంది మహిళలు ఉన్నారు. నిరుద్యోగంతో 3,541 మంది ఆత్మహత్య చేసుకోగా అందులో 3,203 మంది మగవారు, 337 మంది ఆడవారు ఉన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు 1,673 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, అందులో 991 మంది విద్యార్థులు, 682 మంది విద్యార్థినీలు ఉన్నారు. వరకట్నం సంబంధిత సమస్యలతో 2021లో 1,724 మంది ఆత్మహత్య చేసుకోగా, అందులో 1,503 మంది మహిళలు, 220 మంది పురుషులు, 1 ట్రాన్స్ జండర్ ఉన్నారు.
తెలంగాణలో ఆత్మహత్యల రేటు 26.90
తెలంగాణలో 2020లో 8,058 మంది ఆత్మహత్యలు చేసుకోగా, 2021లో 10,171 (26.90 రేటు) మంది చేసుకున్నారు. అందులో 7,963 మంది పురుషులు, 2,206 మంది మహిళలు ఉన్నారు. 26.2 శాతం పెరిగాయి. మొత్తం ఆత్మహత్యల్లో 6.2 శాతం జరిగాయి. హైదరాబాద్లో 2020లో 398 మంది ఆత్మహత్య చేసుకోగా, 2021లో 571 మంది చేసుకున్నారు. 43.5 శాతం పెరిగాయి.తెలంగాణలో 359 మంది వ్యవసాయంపై ఆధారపడిన వారు ఆత్మహత్య చేసుకోగా, అందులో 330 మంది పురుషులు, 29 మంది మహిళలు ఉన్నారు. అలాగే 352 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, 323 మంది పురుషులు, 29 మంది మహిళలు ఉన్నారు. సొంత భూమి ఉన్న రైతులు 303 మంది ఆత్మహత్య చేసుకోగా, అందులో 274 మంది పురుషులు, 29 మంది మహిళలు ఉన్నారు. భూము కౌలుకు తీసుకొని సాగు చేసే రైతులు 49 మంది ఆత్మహత్య చేసుకోగా, అందరూ పురుషులే. వ్యవసాయ కార్మికులు ఏడుగురు ఆత్మహత్య చేసుకోగా, అందరూ పురుషులే ఉన్నారు. రోజువారీ కూలీలు 4,223 మంది ఆత్మహత్య చేసుకోగా, అందులో 3,522 మంది పురుషులు, 701 మంది మహిళల ఉన్నారు. పేదరికంతో 7 మంది ఆత్మహత్య చేసుకోగా, అందులో పురుషులు 1, మహిళలు 6 ఉన్నారు. నిరుద్యోగులు 28 మంది ఆత్మహత్య చేసుకోగా, అందులో 25 మంది పురుషులు, 3 మహిళలు ఉన్నారు.
తెలంగాణలో 192 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకోగా, అందులో 165 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. స్వయం ఉపాధి చేస్తున్నవారు 1,953 మంది ఆత్మహత్య చేసుకోగా, అందులో 1,732 మంది పురుషులు, 221 మంది మహిళలు ఉన్నారు.
ప్రమాద మరణాల్లో మహారాష్ట్ర ఫస్ట్...
2021లో ప్రమాద మరణాలు మహారాష్ట్ర (58,242), మధ్యప్రదేశ్ (40,510), ఉత్తరప్రదేశ్ (36,521) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. అందులో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఒరిస్సాలో 1,746, బీహార్లో 830, మహారాష్ట్రలో 761 మరణాలతో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. దేశంలో 53 నగరాల్లో 2020లో 50,512 మరణాలు జరగగా, 2021లో 53,497 మరణాలు జరిగాయి. 5.9 శాతం మరణాలు పెరిగాయి. అందులో 43,703 మంది పురుషులు, 9,783 మంది మహిళలు, 11 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అందులో ప్రకృతి వైపరీత్యాలు వల్ల 2020లో 311 మరణాలు సంభవించగా, 2021లో 533 జరిగాయి. 71.4 శాతం పెరిగాయి. ఇతర కారణాలతో 202లో 50,201 మరణాలు జరగగా, 2021లో 52,964 మరణాలు జరిగాయి. 5.5 శాతం మరణాలు పెరిగాయి.