Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈద్గా మైదాన్‌లో గణేష్ ఉత్సవాలు వద్దు
- యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు
- స్థల యాజమాన్య హక్కులను హైకోర్టులో తేల్చుకోవాలని సూచన
న్యూఢిల్లీ, బెంగళూరు : బెంగళూరు చామరాజ్‌పేట్‌లోని ఈద్గా మైదానంలో గణేష్ చతుర్ధి ఉత్సవాలను నిర్వహించే విషయంలో పాలక బీజేపీకి సుప్రీంలో ఎదురు దెబ్బ తగిలింది. గణేష్ ఉత్సవాలను నిర్వహించడానికి ముందుగా తీసుకోవాల్సిన అనుమతులను తీసుకోనందున అక్కడ ఈ కార్యక్రమం జరపరాదంటూ వక్ఫ్ బోర్డు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఈ వివాదం సుప్రీంకి చేరింది. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో వుంచుకునే రాజకీయ ఉద్దేశంతో చేపట్టిన చర్య ఇదని వక్ఫ్ బోర్డు విమర్శించింది. ఆ పిటిషన్‌ను విచారణకు చేపట్టిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం, అక్కడ యథాతథ స్థితిని కొనసాగించాల్సిందిగా ఆదేశించింది. రాబోయే రెండు రోజుల్లో గణేశోత్సవాలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేసింది. అయితే, ఈ స్థలం ఎవరిదనే విషయంలో వక్ఫ్‌బోర్డుకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదమున్నందున ఆ స్థలంపై యాజమాన్య హక్కులు తేల్చుకునేందుకు హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది. రెవిన్యూ మంత్రి అశోక్ ఈ విషయాన్ని ప్రతిష్టాకరంగా తీసుకోవడంతో ఎలాగైనా అనుమతి పొందగలమనే ధీమాతో వున్నారు. కాగా, ఈద్గా మైదాన్ వద్ద రెండు మతాల మధ్య ఎలాంటి వివాదాలు రేగకుండా చూసేందుకు ముందస్తు జాగ్రత్తగా 1600మంది పోలీసు సిబ్బందిని ప్రభుత్వం మోహరించింది.
తమ హక్కులు ఈ విధంగా తుంగలో తొక్కబడతాయనే భావన మైనారిటీల్లో కలిగించవద్దని వక్ఫ్ బోర్డు తరపు న్యాయవాది దుష్యంత్ దావె బెంచ్‌ను కోరారు. ఇటువంటి ఉత్సవాలను ఆ మైదానాన్ని ఉపయోగించవద్దని కోరారు. ఈ స్థలంలో మరే ఇతర కమ్యూనిటీకి చెందిన మత పరమైన ఉత్సవాలు, కార్యక్రమాలు ఇంతవరకు జరగలేదు. చట్ట ప్రకారం ఇది వక్ఫ్ బోర్డు ఆస్తి. కానీ అకస్మాత్తుగా ఈ ఏడాది దీన్ని వివాదాస్పద స్థలంగా వారు చెబుతున్నారు. అందుకే ఇక్కడ గణేష్ ఉత్సవాలను నిర్వహించాలనుకుంటున్నామని చెబుతున్నారని బోర్డు పేర్కొంది.
దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోV్ాతగి మాట్లాడుతూ, రెండు రోజుల పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసే తాత్కాలిక ఆలయానికి అనుమతించాలని కోరారు. శాశ్వత కట్టడాన్ని ఏదీ నిర్మించబోమని చెప్పారు. దీనిపై వక్ఫ్ బోర్డు లాయర్ వ్యాఖ్యానిస్తూ, ''ఆనాటి యుపి ముఖ్యమంత్రి కూడా బాబ్రి మసీదు కేసులో హామీ ఇచ్చారు. అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు.'' అని పేర్కొన్నారు.
ఈ వాదనలకు ముందు, న్యాయమూర్తులు మాట్లాడుతూ, గతంలో ఈ మైదానంలో ఇటువంటి కార్యకలాపాలు జరిగాయా అని ప్రశ్నించారు. దానిపై రోV్ాతగి స్పందిస్తూ ఇప్పటి కార్యక్రమాన్ని తిరస్కరించడానికి అదొక కారణం కారాదని అన్నారు. గత 200ఏళ్ళుగా ఈ స్థలంలో పిల్లలు ఆడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన రెవిన్యూ రసీదులన్నీ ప్రభుత్వం పేరుతోనే వున్నాయని చెప్పారు. ఢిల్లీలో అన్ని చోట్లా దసరా దిష్టి బొమ్మలు తగలబెడతారు. ఈ హిందూ ఉత్సవాలు చేయొద్దని అక్కడి ప్రజలు అంటున్నారా ? మనం కొంచెం విశాల దృక్పథంతో వ్యవహరించాలి. గుజరాత్లో వీధులు, సందులు అన్నీ ఈ పండుగల కోసం మూసేస్తారు. రెండు రోజుల పాటు గణేష్ ఉత్సవాలను అనుమతిస్తే ఏమవుతుంది? అని ఆయన వాదించారు. దీనిపై బోర్డు తరపు లాయర్ దుష్యంత్ స్పందిస్తూ ప్రార్ధనల కోసం మైనారిటీలను అనుమతించే ఆలయం ఏదైనా ఈ దేశంలో వుందా అంటూ విస్మయం వ్యక్తం చేశారు.
ఇతర మతాల దళితులకూ రిజర్వేషన్ ప్రయోజనాలు ఇవ్వొచ్చా ?
- కేంద్రానికి మూడు వారాల గడువును ఇచ్చిన సుప్రీం
షెడ్యూల్డ్ కులాలవారు అనుభవిస్తున్న రిజర్వేషన్ ప్రయోజనాలను ఇతర మతాలకు చెందిన దళిత సభ్యులకు కూడా విస్తరించవచ్చా లేదా అనే విషయమై వైఖరిని వెల్లడించేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు మూడు వారాల గడువును ఇచ్చింది. జస్టిస్ ఎస్.కె.కౌల్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2018నాటి ఈ పిటిషన్లు అప్పటి నుండి సుప్రీంలో పెండింగ్‌లోనే వున్నాయి. ఈ అంశం విస్తృతమైన సామాజిక పర్యవసానాలు కలిగిందని బెంచ్ పేర్కొంది. ''సామాజిక పర్యవసానాల కారణంగానే ఈ విషయాలను ఇలా పెండింగ్‌లో పెడుతున్నారు. కానీ ఏదో ఒక సమయంలో మనం వాస్తవాన్ని ఎదుర్కొనాల్సి వుంటుంది కదా.'' అని బెంచ్ వాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో మతపరంగా తటస్థంగా వుండాలని కోరుతూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ దళిత్ క్రిస్టియన్స్ (ఎన్సిడిసి) దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. ఎస్సిలకు రిజర్వ్ చేసిన రిజర్వేషన్ కోటా ప్రయోజనాలు దళిత క్రైస్తవులు లేదా క్రిస్టియన్స్ ఆఫ్ షెడ్యూల్డ్ కేస్ట్ ఆరిజిన్‌లకు వర్తింపచేయాలని పలు పిటిషన్లు కోరుతున్నాయి. ఎస్సి ఆరిజన్ క్రైస్తవులు ఎస్సి హోదాను పొందకుండా 1950నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వు నిషేధిస్తోందని ఆ పిటిషన్లు పేర్కొన్నాయి. సమానత్వం, మత స్వేచ్ఛ, వివక్షా రహిత హక్కులకు ఇది విరుద్ధంగా వుందని పిటిపన్లు పేర్కొంటున్నాయి. మతం నిషేధిస్తున్నప్పటికీ క్రైస్తవంలో కూడా కులాల పరంపర కొనసాగుతోందని ఎన్సిడిసి తరపు లాయర్లు వాదిస్తున్నారు. ముస్లింలు వంటి ఇతర మతాల్లో కూడా ఈ సామాజిక పరంపర నెలకొందని కోర్టు పేర్కొంది.