Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏచూరి తదితరుల సంతాపం
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యవసాయ ఆర్థిక వేత్త, ప్రణాళికా సంఘం మాజీ సభ్యులు అభిజిత్ సేన్ (72) సోమవారం రాత్రి కన్నుమూశారు. ఆయన భౌతిక కాయానికి ఇక్కడి గ్రీన్ పార్క్ శ్శశానవాటికలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు జరిగాయి. అభిజిత్ సేన మృతి పట్ల సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాంఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి థామస్ ఐజాక్, నీతి ఆయోగ్ సభ్యులు రమేష్ చంద్ తో సహా పలువురు రాజకీయ నేతలు, ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నేతలు, కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకు భార్య జయతి ఘోష్, కుమార్తె ఉన్నారు. జయతి ఘోష్ జెఎన్‌యులో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా ఉన్నారు. అభిజిత్ సేన్ గత కొంత కాలంగా శ్వాసకోశ సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నారు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రణాళికా సంఘంలోను, , 14వ ఆర్థిక సంఘంలోను సభ్యుడిగా పనిచేసిన అభిజిత్ సేన్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దేశంలోని అగ్రగామి నిపుణులలో ఒకరు. నాలుగు దశాబ్దాలకు పైబడిన తన అకడమిక్ కెరీర్లో ప్రొఫెసర్ అభిజిత్ కేంబ్రిడ్జి, ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలలో ఆర్థిక శాస్త్రాన్ని బోధించారు. ఆర్థిక సంఘం సిఫారసులను సాకుగా చూపి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హౌదా ఇవ్వనిరాకరించిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పు పట్టారు.