Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏం దొరకలేదు..నిజం గెలిచింది : మనీశ్ సిసోడియా
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మద్యం విధానానికి సంబంధించిన అవకతవకల కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈకేసుకు సంబం ధించి ఇటీవల ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నివాసంలో సోదాలు చేపట్టిన సీబీఐ అధికారు లు..తాజాగా ఆయన బ్యాంకు లాకర్లనూ పరిశీలించారు. మంగళవారం ఉదయం సిసోడియా, ఆయన సతీమణి ఉత్తరప్రదేశ్ ఘాజియాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చేరుకున్నారు. వీరి సమక్షంలో సీబీఐ అధికారులు లాకర్లను తనిఖీ చేశారు. అయితే ఈ సోదాల్లో అనుమానాస్పదంగా ఏమీ లభించలేదని మీడియాలో వార్తలు వెలువడ్డాయి. తనిఖీల అనంతరం సిసోడియా మీడియాతో మాట్లాడారు. ''మా ఇంట్లో మాదిరిగానే నా బ్యాంకు లాకర్లలోనూ అధికారులకు ఏం లభించలేదు. ఈ ఆరోపణల్లో నాకు క్లీన్చిట్ రావడం ఆనందంగా ఉంది. నిజం గెలిచింది'' అని అన్నారు.
లాకర్ల తనిఖీల విషయాన్ని సిసోడియా సోమవారం ట్విట్టర్లో వెల్లడించారు. ''సీబీఐ నా బ్యాంకు లాకర్లను సోదా చేయనుంది. ఆగస్టు 19న నా ఇంట్లో 14 గంటలపాటు జరిపిన తనిఖీల్లో ఏం దొరకలేదు. ఇప్పుడు బ్యాంకు లాకర్లలోనూ ఏం లభించదు. సీబీఐకి మళ్లీ స్వాగతం పలుకు తున్నాం. ఈ దర్యాప్తునకు నేను, నా కుటుంబం పూర్తిగా సహకరిస్తా''మని ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఢిల్లీలో గతేడాది నవంబర్‌లో కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆబ్కారీ విధానంలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడంతో పాటు విధానపరమైన లోపాలున్నట్టు ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. టెండర్ల విధానంలో కొందరికి ఆయాచిత లబ్ది చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా..కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖకు బాధ్యులుగా ఉన్న మనీశ్ సిసోడియా పాత్రనూ అందులో ప్రస్తావించారు. ఈ క్రమంలో సీబీఐ కేసు నమోదు చేసి..రంగంలో దిగింది. ఈ కేసులో సిసోడియా సహా మొత్తం 15మంది వ్యక్తులు, ఓ కంపెనీ షేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చింది.