Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓనమ్ పండుగ సంబరాలకు ఆటంకం
తిరువనంతపురం : కేరళలోని దక్షిణ, సెంట్రల్ జిల్లాల్లో గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నెల 4వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఓనమ్ పండుగ సంబరాల ఉత్సాహం సన్నగిల్లుతోంది. ఆరేబియా సముద్రం నుంచి పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల కారణంగా రుతుపవనాలు క్రియాశీలంగా ఉన్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. జిల్లాల్లో పలు రైళ్లు రాకపోకలను నిలిపివేశారు. గత 24గంటల్లో ఎర్నాకులం, కొట్టాయం, పాలక్కాడ్, కన్నూర్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. 2018 నుంచి కేరళలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. 60ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా గతేడాదిలో రికార్డు స్థాయిలో అత్యధిక వార్షిక వర్షపాతం నమోదైంది. అలా కురవడం 120ఏండ్లలో ఆరవసారి మాత్రమే. ఈ ఏడాది కూడా ఇటువంటి విపరీత వాతావరణ మార్పులు వుండొచ్చునని నిపుణులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆగస్టు మాసంలో విపరీతంగా వర్షాలు కురిశాయి. సాధారణంగా 445.2 మిల్లీమీటర్లు కాగా, 550మి.మీ వర్షపాతం నమోదైంది. 2019లో 950, 2018లో 822 మి.మీ నమోదైంది. ఈసారి కొద్దిగా తగ్గినా మొత్తమ్మీద భారీ వర్షాలు కురిశాయి.