Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ఎస్ఎస్ యూనిఫాంలో వినాయకుడేంటి : ప్రకాశ్‌రాజ్
న్యూఢిల్లీ : బీజేపీ అనుసరించే విధానాల్ని ఎండగట్టడంలో తనదైన ప్రత్యేకతను సొంతం చేసుకున్న బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్. 'జస్ట్ ఆస్కింగ్' అంటూ ట్విట్టర్లో ఆయన వేసే ప్రశ్నలు, చేసే విమర్శలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతాయి. వినాయక చవితి సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ అందర్నీ ఆలోచింపజేస్తోంది. ఆ ట్వీట్లో ఏముందంటే, ప్రధాని నరేంద్రమోడీ ధ్యానం చేసుకుంటూ ఉండగా, వినాయకులు ఆయనకు ఇరువైపులా నిల్చున్నట్టు, వినాయకుడు ఆర్ఎస్ఎస్ యూనిఫాం ధరించినట్టు, కేజీఎఫ్, అల్లు అర్జున్‌లను గుర్తు చేస్తూ వినాయకుడి విగ్రహాలను రూపొందించడాన్ని తప్పుబట్టారు. ఇదేంటని ప్రశ్నించారు. ఇలాంటివాటి వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతినవా? అని నిలదీశారు. తాజా రాజకీయ పరిణామాలపై సోషల్‌మీడియాలో ప్రకాశ్ రాజ్ చురుకుగా స్పందిస్తున్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై సునిశిత విమర్శలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మైసూర్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తాను మైనస్ మార్కులు వేస్తానని అన్నారు. 30 కన్నా తక్కువ వస్తే ఫెయిలైనట్టే కదానని చెప్పారు. సాగు భూముల కొనుగోళ్లకు అనుమతులు ఇచ్చారని, ఉద్యోగ కల్పనకు కృషి చేయటం లేదని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతుండటంతో దాని ప్రభావం నిత్యావసర ధరలపై పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుచూపు లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతారా? అంటూ నిలదీశారు.