Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ భారీ ర్యాలీ
- కోల్‌కతాలో ముగిసిన యాత్ర.. నిరసనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు
కోల్‌కతా: మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానానికి (ఎన్ఈపీ) వ్యతిరేకంగా విద్యార్థి లోకం కదం తొక్కింది. గత నెల రోజులుగా ఎన్ఈపీకి వ్యతిరేకం గా ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్త ప్రచారాన్ని నిర్వహిస్తూ ర్యాలీలతో ముందుకు సాగింది. ఇది దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలను కవర్ చేసింది. చివరగా కోల్‌కతా కాలేజ్ స్ట్రీట్‌కు చేరు కున్నది. యాత్ర చివరి రోజు సందర్భంగా కాలేజ్ స్ట్రీట్‌లో జరిగిన భారీ నిరసనలో విద్యార్థులు వేల సంఖ్యలో పాల్గొ న్నారు. ఇక్కడ భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముందు సీల్దాV్‌ా, హౌరా, శ్యామ్‌బజార్, సుబోధ్ మల్లిక్ స్క్వేర్ల నుంచి నాలుగు మహా ర్యాలీలు కాలేజ్ స్ట్రీట్‌ను చేరుకున్నాయి. శ్యామ్‌బజార్ ఐదు పాయి ంట్ల నుంచి కోల్‌కతా ఎస్ఎఫ్ఐ కార్యకర్తల భారీ ర్యాలీ కాలేజీ స్ట్రీట్‌కు చేరుకున్నది. తూర్పు, ఉత్తర భారత్‌ల నుంచి విద్యార్థుల ర్యాలీ పాటలతో, కవితలతో, నినాదాలతో ఇక్కడ కు వచ్చింది. 'సేవ్ ఎడ్యుకేషన్', 'సేవ్ ది కంట్రీ', 'సేవ్ ది కాన్ స్టిట్యూషన్' నినాదాలు ఇక్కడ హోరెత్తాయి. ఇందు లో సాధారణ ప్రజలు చాలా మంది భాగమ య్యారు. ఎస్ఎఫ్ ఐ తొలి ఆలిండియా ప్రధాన కార్య దర్శి బిమన్ బోస్, ఎస్ఎఫ్ఐ ప్రస్తుత ఆలిండియా ప్రధాన కార్యదర్శి మయూక్ విశ్వాస్, జాయింట్ సెక్రెటరీ దిప్సిత థర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య, రాష్ట్ర అధ్యక్షుడు ప్రతికూర్ రహమాన్, ఇతర ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇది దేశ విద్యా వ్యవస్థకు నష్టాన్ని తీసుకొస్తుందని చెప్పారు. దేశంలోని పేద చిన్నారుల విద్యకు ఎన్ఈపీ ముగింపు పలుకుతుంద ని బిమన్ బోస్ అన్నారు. విద్యను ప్రయివేటీకరిం చటానికే కేంద్రం దీనిని తీసుకొచ్చిందని ఆరోపించారు. ఎన్ఈపీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష వాదులంతా దేశవ్యాప్తంగా నిరసన చేస్తారన్నారు. ఈ ఎన్ఈపీని ఆరెస్సెస్ సృష్టించిందని మయూక్ విశ్వాస్ తెలిపారు. దీనిని తాము ఆమోదించ బోమన్నారు. విద్యార్థు ల చదువు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను అమ్ముకుంటే, కేంద్రం రైల్వేలు, బ్యాంకులు, బీమా సంస్థలను అమ్ముతున్నదని మయూక్ విశ్వాస్ చెప్పారు. ఇలాంటి దొంగల నుంచి దేశాన్ని కాపాడ టానికి విద్యార్థులు బలమైన ఉద్యమాన్ని ఏర్పాటు చేయాలన్నారు.