Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీయూఈటీతో నీట్, జేఈఈ విలీనంపై యూజీసీ చీఫ్
న్యూఢిల్లీ : మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్, ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జేఈఈని సీయూఈటీతో-యూజీతో విలీనం చేయడంపై అధికారికంగా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మెన్ ఎం. జగదీశ్ కుమార్ తెలిపారు. రాబోయే రెండేండ్ల పాటు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)తో జేఈఈ, నీట్లను విలీనం చేసే ఆలోచన లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపిన రెండు రోజుల తర్వాత కుమార్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. జేఈఈ, నీట్లను భవిష్యత్తులో సీయూఈటీలో విలీనం చేస్తామని యూజీసీ చీఫ్ గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. కనీసం వచ్చే రెండేండ్లలో ఇది అమలు చేయబడదని జగదీశ్ కుమార్ చెప్పారు. తగినంత సంప్రదింపుల తర్వాతే ఇది జరుగుతుందన్నారు.