Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ) రాజ్యాంగ చెల్లుబాటును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లను ఈ నెల 12న సుప్రీంకోర్టు విచారించనున్నది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. 2020 జనవరి 10 నుంచి అమలులోకి వచ్చిన సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, చట్టాన్ని సవాల్ చేస్తూ 200కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. 2019 డిసెంబర్లో అప్పటి సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బాబ్డే, నాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం చట్టంపై స్టే విధించకుండా నోటీసు జారీ చేసింది. ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనం విచారించవచ్చని కోర్టు సూచించినప్పటికీ, ఆ మేరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు.