Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాకీ వరల్డ్‌కప్ డ్రా విడుదల
భువనేశ్వర్ (ఒడిశా) : ఎఫ్ఐహెచ్ 2023 మెన్స్ హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు సులువైన డ్రా ఎదురైంది!. వరుసగా రెండోసారి హాకీ వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇస్తోన్న భారత్.. గ్రూప్ దశలో ఇంగ్లాండ్, స్పెయిన్, వేల్స్‌తో తలపడనుంది. వరల్డ్ నం.5 హాకీ ఇండియా గ్రూప్-డిలో ఉత్తమ ర్యాంక్ కలిగిన జట్టు. కామన్వెల్త్ చాంపియన్ ఆస్ట్రేలియా గ్రూప్-ఏలో అర్జెంటీనా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికాలతో పోటీపడనుంది. డిఫెండింగ్ వరల్డ్ చాంపియన్ బెల్జియం గ్రూప్-బిలో చోటుచేసుకుంది. జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్‌లు బెల్జియంతో గ్రూప్ దశలో పోటీపడనున్నాయి. గ్రూప్-సిలో నెదర్లాండ్స్, న్యూజిలాండ్, మలేషియా, చిలీలు ఉన్నాయి. గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా క్వార్టర్ఫైనల్స్కు చేరుకోనుంది. తర్వాతి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్ దశకు చేరుకునేందుకు మరో అవకాశం దక్కించుకోనున్నాయి. ప్రీ క్వార్టర్స్ తరహా మ్యాచ్‌లో నెగ్గిన జట్టు క్వార్టర్స్‌కు చేరుకుంటాయి. 2019 ఎఫ్ఐహెచ్ మెన్స్ హాకీ వరల్డ్‌కప్‌కు సైతం ఒడిశా వేదికగా నిలిచింది. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం ప్రపంచ శ్రేణి సదుపాయాలు, మౌళిక వసతులతో మెగా ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ వరల్డ్‌కప్ కోసం ఒడిశాలోని రూర్కెలా నూతనంగా బిర్సా ముండా స్టేడియం నిర్మించారు. కళింగ స్టేడియంతో పాటు బిర్సా ముండా స్టేడియం హాకీ వరల్డ్‌కప్ మ్యాచులకు వేదిక కానుంది. రూర్కెలా ప్రాంతం హాకీ క్రీడాకారుల కార్ఖానాగా పేరొందింది. అందుకే, ఒడిశా ప్రభుత్వం వరల్డ్‌కప్ ఆతిథ్యానికి ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది.