Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు విధులు అందజేత
- దేశంలోని నిరుద్యోగ యువతకు తీవ్ర నష్టం : వి శివదాసన్
- కేంద్ర హౌం మంత్రికి లేఖ
న్యూఢిల్లీ : దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ప్రధాన భద్రతా సవరణలో భాగంగా 3,000 వేలకు పైగా సీఐఎస్ఎఫ్ పోస్టులు రద్దు చేశారు. దీనికింద నిఘా, రక్షణ కోసం స్మార్ట్ టెక్నాలజీ టూల్స్ సహా యంతో ప్రయివేట్ భద్రతా సిబ్బంది నాన్-సెన్సిటివ్ సాంకేతికత సహాయంతో విధులను అందించనున్న ది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీ ఏఎస్),సెంట్రల్ ఇండిస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) క్షేత్ర కార్యాలయాలతో పాటు కేంద్ర పౌర విమానయాన, గృహ మంత్రిత్వ శాఖలు సం యుక్తంగా ప్రారంభించిన 2018-19 కార్యాచరణ ప్రణాళిక ఇప్పుడు 50 పౌర విమానాశ్రయాల్లో అంతటా అమలు చేయబడుతోంది.
బీసీఏఎస్ ఏవియేషన్ సెక్యూరిటీ రెగ్యులేటర్ రూపొందించిన బ్లూప్రింట్ ప్రకారం మొత్తం 3,049 సీఐఎస్ఎఫ్ ఏవియేషన్ సెక్యూరిటీ పోస్టులను, కేవలం 1,924 ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో భర్తీ చేస్తారు. సీసీటీవీ కెమెరాలు, బ్యాగేజ్ స్కానర్ల వంటి స్మార్ట్ నిఘా సాంకేతికతను సమాంతరంగా ప్రవేశపెట్టింది. అనేక నాన్-సెన్సిటివ్ టాస్క్‌లకు సాయుధ సీఐఎస్ఎఫ్ సిబ్బంది అవసరం లేదని, ఎయిర్పోర్ట్ టెర్మినల్‌లోని కొన్ని ప్రాంతాలను కవర్ చేయగలిగినప్పటికీ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులతో నిర్వహించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. క్యూ నిర్వహణ, ఎయిర్‌లైన్స్ సిబ్బంది, ప్రయాణీకులకు భద్రతా సహాయం, టెర్మినల్ ప్రాంతంలోని కొన్ని ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ల నిర్వహణ వంటి సున్నితమైన విధుల కోసం ప్రైవేట్ భద్రతా సిబ్బందిని ఢిల్లీ, ముంబాయితో పాటు ఇతర విమానాశ్రయాల్లో పెట్టనున్నారు.
దేశంలోని నిరుద్యోగ యువతకు తీవ్ర నష్టం : వి.శివదాసన్
దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో 3,049 సెంట్రల్ ఇండిస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) పోస్టులను రద్దు చేయడంపై సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యులు వి. శివదాసన్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కేంద్ర హౌం మంత్రి అమిత్ షాను కోరారు. 'సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రైవేటీకరించటం దేశంలోని నిరుద్యోగ యువతకు హానికరమైన చర్య. ఒకవైపు ఉపాధి కోసం యువత ఎదురుచూస్తున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ రంగంలో కార్మికులకు కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా ఉపాధి కల్పిస్తున్నది' అని లేఖలో పేర్కొన్నారు. అగ్నిపథ్ వంటి రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్‌ల కింద సాయుధ బలగాల పోస్టులను కాంట్రాక్టీకరణ చేయడంతో దేశంలోని యువతకు సాధారణ ఉపాధి సుదూర స్వప్నంగా మారుస్తుందని తెలిపారు. 3,049 రద్దు చేయబడిన సీఐఎస్ఎఫ్ పోస్టులు ఏవియేషన్ సెక్యూరిటీ గ్రూప్ (ఏఎస్జీ)లో 10 శాతానికి దగ్గరగా ఉన్నాయని తెలిపారు. 'దేశంలో సాయుధ దళాలలో ఇప్పటికే 1,27,000 కంటే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. వాటిని శాశ్వత ప్రాతి పదికన భర్తీ చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవ డానికి బదులుగా, పోస్టులను రద్దు చేయాలనే చర్య సాధారణ ఉపాధి కోసం ఎదురు చూసే యువకుల ప్రయోజనాలకు విరుద్ధం' అని లేఖలో పేర్కొన్నారు. విమానాశ్రయాల భద్రతకు ఈ చర్య హానికరమని పేర్కొన్నారు. 'విమానయానం బాగా ప్రాచుర్యం పొం దుతూ కొత్త విమానాశ్రయాలు వస్తున్న ఈ సమయ ంలో విమానయాన భద్రత నిర్వహణలో నిమగమైన పారామిలిటరీ సిబ్బంది సంఖ్యను తగ్గించాలనే నిర్ణయం విమానాశ్రయాల భద్రతకు హాని కలిగించే చర్య' అని అన్నారు. 3,049 సీఐఎస్ఎఫ్ పోస్టులను రద్దు చేసే చర్యను వెనక్కి తీసుకోవాలని, ఈ అంశంలో తక్షణ జోక్యం చేసుకోవాలని కేంద్ర హౌం మంత్రి అమిత్ షాను కోరారు.