Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సీతారామన్
న్యూఢిల్లీ : ధరలకు ఆజ్యం పోసే నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఆ తప్పులను రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టే ప్రక్రియ మొదలుపెట్టింది. దేశంలో ద్రవ్యోల్బణ కట్టడిలో కేంద్రామే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ధరల కట్టడిలో రాష్ట్రాలూ కీలక పాత్రను పోషించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే ధరలు తగు తాయన్నారు. ఆర్బీఐ చేపడుతున్న ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలొక్కటే ద్రవ్యోల్బణ కట్టడికి సరిపోవన్నారు. అధిక ఇంధన ధరలతోనే వస్తువులు, అహార ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నా యనే విషయాన్ని మంత్రి విస్మరించారని నిపుణుల అభిప్రాయంగా ఉంది