Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలాసోర్ : క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్ (క్యుఆర్ఎస్ఎఎం) వ్యవస్థకు చెందిన ఆరు విమాన పరీక్షలను భారత్ విజయవంతంగా పూర్తి చేసినట్టు డీఆర్డీఓ గురువారం ప్రకటించింది. ఒడిషా తీరంలోని చాందిపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ పరీక్షలు నిర్వహించారు. వివిధ రకాల పరిస్థితుల్లో, వివిధ ముప్పులను ఎదుర్కోవడంలో ఆయుధ వ్యవస్థల సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ పరీక్షలను నిర్వహించారు. 'ఈ పరీక్షలతో వార్‌హెడ్ చైన్‌తో సహా అత్యాధునిక ఆర్ట్ గైడెన్స్, కంట్రోల్ అల్గారిథమ్‌లతో కూడిన ఆయుధ వ్యవస్థల యొక్క కచ్చితమైన సామర్థ్యాన్ని నిర్థారించడంతోసహా అన్ని లక్ష్యాలను అందుకున్నాం' అని ఢిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్ష విజయవంతంతో డీఆర్డీఓ, భారత సైన్యాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఈ వ్యవస్థ ఇప్పుడు భారత సైన్యంలో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది.