Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నుహ్: హర్యానాలో మైనింగ్ మాఫియా మరోసారి రెచ్చి పోయింది. రెండు నెలల క్రితం డీఎస్పీని హత్య చేసిన ఘటనను ఇంకా మర్చిపోక ముందే తాజాగా శుక్రవారం మరోసారి పోలీసులపై దాడికి దిగింది. నుV్‌ా జిల్లాలోని బాడెడ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే కచ్చితమై న సమాచారంతో పోలీసులు, మైనింగ్ శాఖకు చెందిన సంయుక్త బృందం అక్కడకు వెళ్లింది. ఈ బృందాన్ని చూసిన మైనింగ్ మాఫియా అక్కడి నుంచి సమీపంలోని కొండపైకి పారిపోయింది. పోలీసులు అక్కడ ఉన్న మూడు మైనింగ్ యంత్రాలను సీజ్ చేశారు. అయితే కొద్దిసేపటికే కొండపై నుంచి రాళ్లు విసిరి పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిలో ఒక పోలీసు గాయపడ్డారు. ఈ దాడిపై 50 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఐదుగుర్ని ఇప్పటికే గుర్తించారు. సంఘటనా ప్రాంతాన్ని నూV్‌ా ఏసీపీ వరుణ్ సింగ్లా సందర్శించారు. ఈ దాడిని సహించమని, నిందితుల్ని త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు.