Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఇవీ పరిస్థితులు
- మానసిక ఆరోగ్యంపై సగటున 2 శాతం కంటే తక్కువ ఖర్చు చేస్తున్న దేశాలు :యూఎన్డీపీ
న్యూఢిల్లీ : ప్రపంచంవ్యాప్తంగా ఆయా దేశాలలో ఒత్తిడి, విచారం, కోపం, ఆందోళనలు పెరుగుతున్నాయి. గత దశాబ్దకాలంగా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం యూఎన్డీపీ విడుదల చేసిన మానవాభివృద్ధి నివేదికలో వెల్లడైంది. ప్రస్తుతం ఇవి రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయని నివేదిక హైలెట్ చేసింది. ఈ నివేదిక సమాచారం ప్రకారం.. దేశాలు తమ ఆరోగ్య సంరక్షణ బడ్జెట్లో మానసిక ఆరోగ్యం పై సగటున 2 శాతం కంటే తక్కువ ఖర్చు చేస్తున్నాయి. అనిశ్చితి, అసమానత, అభద్రత, విశ్వాసం లేమితో కలిసి వెళ్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం కంటే తక్కువ మంది ప్రజలు చాలా మందిని విశ్వసించవచ్చని భావిస్తున్నారు. గతంతో పోలిస్తే ఇదే అత్యల్పం కావ టం గమనార్హం. ప్రతి ప్రాంతంలోని అభివృద్ధి చెందు తున్న దేశాలు లింగ సమానత్వంలో అత్యంత దుర్బలత్వ పరిస్థితులను ఎదుర్కొంటు న్నాయి. తిరోగమనంలోకి వెళ్తున్నాయి. ఎక్కువ మానవ అభద్రత తక్కువ వ్యక్తిగత నమ్మకంతో ముడిపడి ఉన్నది. తక్కువ మానవాభివృద్ధి సూచిక (హెచ్డీఐ) దేశాలలో, తక్కువ ఆదాయ ప్రజలలో అధిక అభద్రత, తక్కువ వ్యక్తుల మధ్య విశ్వాసం ఉన్నది. అలాగే, వ్యక్తుల మధ్య విశ్వాసం, మానవ భద్రత మధ్య సన్నిహిత సంబంధం ఉన్నది.