Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుబ్రమణ్యస్వామి పిటిషన్ను వ్యతిరేకిస్తూ సీపీఐ ఎంపీ బినరు విశ్వం పిటిషన్
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ పీఠికలో ''సోషలిస్టు, సెక్యులర్ '' పదాలను తొలగించాలంటూ కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్ను వ్యతిరేకిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) నాయకుడు, రాజ్యసభ సభ్యుడు బినోరు విశ్వం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక రాజకీయ పార్టీ మతం పేరుతో ఓట్లు అడిగేలా చేయడమే సుబ్రమణ్యస్వామి పిటిషన్లోని ఏకైక ఉద్దేశమని విశ్వం పిటిషన్లో పేర్కొన్నారు. సుప్రీం కోర్టులో న్యాయవాది శ్రీరామ్ పరక్కత్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాది మహేష్ మీనన్ పిటిషన్ తయారు చేశారు. సుబ్రమణ్య స్వామి అభ్యర్థన న్యాయ ప్రక్రియను పూర్తిగా దుర్వినియోగం చేసిందనీ, విచారణకు అర్హత లేనిదనీ, పిటిషన్ కొట్టివేయడానికి అర్హమైనదని విశ్వం పిటిషన్లో పేర్కొన్నారు. ఆయన అభ్యర్థన రాజ్యాంగంలోని 42 వ సవరణను సవాలు చేస్తుందనీ, ఇది దేశాన్ని ''సార్వభౌమ ప్రజాస్వామ్య రిపబ్లిక్'' నుంచి ''సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రం''గా మార్చిందని పిటిషన్లో పేర్కొన్నారు.
'' సుబ్రమణ్య స్వామి పిటిషన్ ఏకైక ఉద్దేశం మతం పేరుతో ఓట్లు అడిగేలా రాజకీయ పార్టీని అనుమతించడమే'' అని బినరు విశ్వం పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29 (ఎ)లోని సబ్ సెక్షన్ 5ని కొట్టివేయాలని స్వామి చేసిన విజ్ఞప్తిలో ఒకటని, చట్టంలోని సెక్షన్ 29 (ఎ) ఎన్నికల సంఘం వద్ద సంఘాలు, సంస్థలను రాజకీయ పార్టీలుగా నమోదు చేయడానికి పేర్కొందని తెలిపారు. సబ్ సెక్షన్ 5 ప్రకారం దరఖాస్తుదారు చట్టబద్ధమైన భారత రాజ్యాంగంపై సోషలిజం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం సూత్రాలకు నిజమైన విశ్వాసం, విధేయతను కలిగి ఉంటారని, సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతను కాపాడుతామని, దానిని సమర్థించే బాధ్యతను స్వీకరించడానికి రాజకీయ పార్టీ నమోదు కోసం దరఖాస్తు చేసుకుంటారని తెలిపారు. దీన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేయడమంటే, మతం ప్రాతిపదికన ఓట్ల కోసం చేసిన విజ్ఞప్తిని చట్టబద్ధం చేసేలా చూడాలని కోరడమేనని బినరు విశ్వం పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు మతం పేరుతో ఓట్ల కోసం విజ్ఞప్తి చేసేందుకు అత్యుత్సాహంతో సుబ్ర మణ్య స్వామి పిటిషన్ వేశారని విమర్శించారు. ''భారత రాజకీయాన్ని లౌకికవాదంగా ఉంచాలనే ఉద్దేశ్యంతో రాజ్యాంగ నిర్మాతలు ఎల్లప్పుడూ స్పష్టమైన, దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉన్నారు. రాజ్యాంగం లౌకిక స్వభావం ప్రవేశికలో 'సెక్యులర్' పదాన్ని చొప్పించడంపై ఆధారపడి ఉండదు'' అని బినరు విశ్వం పిటిషన్లో పేర్కొన్నారు.