Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొత్తం రికార్డులను రెండు వారాల్లో ఇవ్వండి
- గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
- 11 మంది దోషులకు నోటీసులు
న్యూఢిల్లీ : బిల్కిస్ బానో లైంగికదాడి కేసులో దోషులుగా ఉన్న 11 మందికి ఇచ్చిన క్షమాభిక్ష ఆదేశాలతో సహా మొత్తం ప్రొసీడిం గ్ల రికార్డును రెండు వారాల్లోగా దాఖలు చేయాలని గుజరాత్ ప్రభు త్వాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదే శించింది. అలాగే 11 మంది దోషు లకు నోటీసులు జారీ చేసింది. టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అజరు రస్తోగి, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారిం చింది. ఇదే అంశంపై ఇప్పటికే సీపీఐ(ఎం) మాజీ ఎంపి, పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, జర్నలిస్టు రేవతి లాలూ, ప్రొఫెసర్ రూప్ రేఖా వర్మ పిటిషన్లు దాఖలు చేశారు. తొలిత దోషుల్లో ఒకరి తరపు న్యాయవాది రిషి మల్హోత్రా వాదనలు వినిపిస్తూ గురువారమే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. పిటిషన్ కాపీని మల్హోత్రాకు, గుజరాత్ ప్రభుత్వానికి అందజేయాలని పిటిషనర్లను ధర్మాసనం కోరింది.