Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తాను కాంగ్రెస్ అధ్యక్షుడిని అవుతానా లేదా అనేది పార్టీ ఎన్నికలు జరిగినపుడు స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. 'పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగినప్పుడు.. నేను అధ్యక్షుడిగా ఉంటానా..? ఉండనా..? అనే విషయంపై స్పష్టత వస్తుంది. నేనేం చేయాలో నేను నిర్ణయించుకున్నా. అందులో ఎలాంటి గందరగోళం లేదు. నేను స్పష్టంగానే ఉన్నాను' అని రాహుల్ వెల్లడించారు. 2024 ఎన్నికల దష్ట్యా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు భారత్ జోడోయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. కాశ్మీర్ వరకు సాగే ఈ కాలినడకకు రాహుల్ నేతృత్వం వహిస్తున్నారు. కన్యాకుమారి నుంచి ఈ యాత్ర గురువారం ప్రారంభమైంది. భారత్ జోడో యాత్ర ద్వారా దేశం గురించి కొంత అవగాహన పొందుతున్నానని అన్నారు. ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 17న జరగనున్నాయి. రెండు రోజుల అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.