Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘన స్వాగతం పలికిన విద్యార్థులు
న్యూఢిల్లీ : 'ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలి. రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. దేశాన్ని రక్షించాలి' అన్న నినాదంతో ఎస్ఎఫ్ఐ తలపెట్టిన అఖిల భారత జాతా ఢిల్లీకి చేరుకుంది. ఈ జాతాకు ఢిల్లీ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్ వద్ద వేలాది మంది విద్యార్థులు, యువజనులు, విద్యావేత్తలు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి సభ జరిగింది. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంపై దేశంలోని విద్యార్థి లోకానికి, విద్యావేత్తలకు, తల్లిదండ్రులకు ఈ జాతా అవగాహన కల్పిస్తూ శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టింది. వేలాది మంది విద్యార్థులతో జాతా ఖాల్సా కళాశాల నుంచి ఢిల్లీ యూనివర్సిటీ ఆర్ట్స్ ఫ్యాకల్టీ వరకు సాగింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఎస్ఎఫ్ఐ యూనిట్లు ఎన్ఈపీకి వ్యతిరేకంగా బైక్ ర్యాలీలు, వీధి నాటకాలను నిర్వహించాయి. వీధి నాటకాల్లో ఎన్ఈపీ వల్ల జరిగే నష్టాలను, దేశవ్యాప్తంగా విద్యార్థులపై దాని దుష్ప్రభావాన్ని వర్ణించాయి. ప్రచారంలో ప్రతి క్యాంపస్‌లోని స్థానిక సమస్యలను కూడా లేవనెత్తారు.
డీయూ ఆర్ట్స్ ఫ్యాకల్టీ వద్ద జరిగిన బహిరంగ సభలో విద్యార్థులు థియేటర్ ఆర్ట్స్, నృత్య ప్రదర్శన వంటి సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సభలో ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (డీయూటీఏ) మాజీ అధ్యక్షురాలు నందితా నారియన్, డీయూటీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు జితేందర్ మీనా, అఖిల భారత నార్తర్న్ జాతాకు నాయకత్వం వహించిన డినిట్ డెంటా, ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి మయూఖ్ బిస్వాస్ ప్రసంగించారు. జాతా సాయంత్రం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)కు చేరుకుంది. అక్కడ జేఎన్‌యూ విద్యార్థులు కాగడాలతో ఘన స్వాగతం పలికారు. గంగాదాబా నుంచి సబర్మతి దాబా వరకు ప్రదర్శన నిర్వహించారు. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్‌తో పాటు జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురా లు అయిషీ ఘోష్, ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విపి సాను, మయూక్ బిశ్వాస్, కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యులు నితీష్ నారాయన్ ప్రసంగించారు. విద్యార్థి వ్యతిరేక జాతీయ విద్యా విధానానికి (ఎన్ఈపీ) వ్యతిరేకంగా విద్యార్థులను చైతన్యం చేయడానికీ, ఏకం చేయడానికి అఖిల భారత జాతాలు 2022 ఆగస్టు 1న దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రారంభమ య్యాయని తెలిపారు. దాదాపు నెలన్నరగా ఈ జాతాలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రయాణిం చాయని వివరించారు. ప్రదర్శనలు, సభలు, ర్యాలీలు వంటి కార్యక్రమాలతో మోడీ సర్కార్ విద్యా వ్యతిరేక విధానాలను విద్యార్థుల్లోకి తీసుకెళ్లామని చెప్పారు. ఎన్ఈపీ వివిధ మార్గాల్లో విద్యను ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో భాగమని విమర్శిం చారు. ఆర్థిక స్వయంప్రతిపత్తి పేరుతో ఫీజులను పెంచడం, బహుళ నిష్క్రమణ పాయింట్ల (మల్టీపుల్ ఎగ్జిట్ పాయింట్స్) తో కూడిన నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఎఫ్‌వైయూపీ)ని మళ్లీ ప్రవేశపెట్టడం, మాస్టర్స్ డిగ్రీలను ఒక సంవత్సరానికి మాత్రమే తగ్గించడం, ఎంఫిల్ డిగ్రీని పూర్తిగా తొలగించడం వంటివి ఇందులో ఉన్నాయని విమర్శి ంచారు. ఉన్నత విద్యలో ఎక్కువ భాగాన్ని ఆన్లైన్ లో చేసే ప్రయత్నం కూడా ఉందనీ, ఇది డ్రాపౌట్ రేటు పెరిగేందుకు దారి తీస్తుందని విమర్శించారు. విద్యను ప్రైవేటీకరించే ఈ ప్రయత్నా న్ని నిరసిస్తూ, ఎన్ఈపీకి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ అఖిల భారత జాతాను నిర్వహించిందని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఢిల్లీ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి ప్రితీష్ మీనన్, నాయకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.