Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం ఉన్నది
- బాధితురాలికి న్యాయం జరగాలని ఉమ్మడి గొంతె లేవనెత్తడం నేరమా?
- మార్పు కోసం కొన్నిసార్లు ఆందోళనలు అవసరం
- యూపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదిపై సీజేఐ ధర్మాసనం ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద ఉత్తరప్రదేశ్ పోలీ సులు దాఖలు చేసిన కేసులో కేరళ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్‌కు అత్యున్నత న్యాయస్థానం బెయి ల్ మంజూరు చేసింది. సిద్ధిక్ కప్పన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ శుక్రవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ''ప్రతి వ్యక్తికి వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ ఉన్న ది. అతను (హత్రాస్) బాధితురాలికి న్యాయం జరగాలని, ఉమ్మడి గొంతును లేవనెత్తడానికి ప్రయత్నించాడు. ఇది చట్టం దృష్టిలో నేరం అవుతుందా?'' అని ధర్మాసనం ప్రశ్నించింది.
యూపీ రాష్ట్రం తరపున సీనియర్ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ వాదనలు వినిపిస్తూ హత్రాస్ సంఘటన చుట్టూ ప్రచారం జరుగుతోందనీ, అల్లర్లను ప్రేరేపించ డానికి పీఎఫ్ఐ కుట్రలో కప్పన్ భాగమని అన్నారు. ''సెప్టెంబర్ 2020లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సమావేశంలో కప్పన్ ఉన్నారు. నిధులు ఆగిపోయాయని సమావేశంలో చెప్పారు. వారు సున్నితమైన ప్రాంతాలకు వెళ్లి అల్లర్లను రెచ్చగొట్టాలని సమావేశంలో నిర్ణయించారు. సహ నిందితులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. పీఎఫ్ఐ కీలక సభ్యుల్లో ఒకరు కుట్రను బయటపెట్టారు'' అని జెఠ్మలానీ అన్నారు. సీజేఐ జస్టిస్ యుయు లలిత్ జోక్యం చేసుకొని ''కానీ సహ నిందితుడి వాంగ్మూలాలను అతనికి ఆపాదించలేం. సాక్ష్యంగా ఉపయోగించలేం'' అని అన్నారు.
అశాంతిని రెచ్చగొట్టేందుకు హత్రాస్ ఘటనను ఒక సాధనంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారని జెఠ్మలానీ అన్నారు. ''అశాంతి సృష్టించడానికి వారు హత్రాస్‌కు వెళుతున్నారు. వారు ఈ సాహిత్యాన్ని దళిత ప్రజలకు పంపిణీ చేయబోతున్నారు. మొత్తం ప్రచారం హత్రాస్ బాధితురాలికి న్యాయం. ఆపై ఎజెండా ప్రధానమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ అంటూ ఈ మెయిల్లు పంపారు. ఇది నిర్దేశించబడింది'' అని జెఠ్మలానీ అన్నారు. అయితే, దీన్ని ధర్మాసనం తిరస్కరిం చింది. అయితే ప్రాసిక్యూషన్ ఆధారం చేసు కున్న అంశాలలో ఏది రుజువు చేస్తుందని సీజేఐ జస్టిస్ లలిత్ ప్రశ్నించారు. కప్పన్ అల్లర్లలో పాల్గొన్నట్లు చెప్పడానికి ఏదైనా డాక్యుమెంట్ ఉన్నదా? చూపించండని జస్టిస్ యుయు లలిత్ అన్నారు. కప్పన్‌ను అదుపులోకి తీసుకు న్నప్పుడు అతని వద్ద ఏం సేకరించారు? ఏం ఉన్నాయి? అని సీజేఐ ప్రశ్నించారు. దీంతో న్యాయవాది జెఠ్మలానీ ఐడీ కార్డులు, కొన్ని సాహిత్యం దొరికాయని తెలిపారు. ఐడీ కార్డు లు, సాహిత్యమేనా? ఏమైనా పేలుడు పదార్థా లు దొరికాయా? ప్రశ్నించారు. దీనికి జఠ్మలానీ ప్రతికూలంగా బదులిచ్చాడు. వెంటనే జోక్యం చేసుకున్న కప్పన్ తరపున సీనియర్ న్యాయ వాది కపిల్ సిబల్ పేలుడు పదార్థాలు కనుగొన బడలేదనీ, కారులో సాహిత్యం దొరికిందని పేర్కొన్నారు. సాహిత్యాన్ని ''అల్లర్ల కోసం టూల్‌కిట్'' గా జెఠ్మలానీ పేర్కొన్నారు. వెంటనే కపిల్ సిబల్ జోక్యం చేసుకొని ''జస్టిస్ ఫర్ హత్రాస్ యువతి సాహిత్యం'' ఉన్నదని పేర్కొన్నారు. సాహిత్యం లో ఉన్న అంశాల్లో ఏది ప్రమాదకరమైనది పేర్కొంటారని జెఠ్మలానీని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి బదులిస్తూ, బాధిత కుటుంబానికి తెలియకుండా పోలీసులు మృతదేహాన్ని ఎలా దహనం చేశారో సాహిత్యం లో ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ''2012లో నిర్భయ కోసం ఇండియా గేట్ వద్ద కూడా నిరసనలు జరిగాయి. మార్పు తీసుకురావడాని కి కొన్నిసార్లు నిరసనలు అవసరమవుతాయి. ఆ తర్వాత చట్టాల్లో మార్పులు వచ్చాయి. ఇవి నిరసనలు అని జెఠ్మలానీ తెలుసుకోవాలి. ఇప్పటి వరకు మీరు రెచ్చగొట్టే విధంగా ఉన్నా యని ఏమీ చూపించకపోయారు'' అని జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ వ్యాఖ్యానించారు. అల్లర్లను రెచ్చగొట్టేందు కే కప్పన్ హత్రాస్‌కు వెళ్లారని జెఠ్మలానీ మళ్లీ పాతపాటే పాడారు. దీన్ని ధర్మాసనం తిరస్కరించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం కప్పన్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది.
కప్పన్‌కు సుప్రీం షరతులు
ఆరు వారాల పాటు ఢిల్లీలో ఉండి జంగ్‌పుర పోలీస్ స్టేషన్లో ప్రతి సోమవారం రిపోర్టు చేయాలని కప్పన్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఆరు వారాల వరకు ఢిల్లీ విడిచి వెళ్లకూడదు. ఆ తర్వాత, అతను కేరళకు తిరిగి వెళ్లడానికి స్వేచ్ఛను కలిగి ఉంటారనీ, అదే విధంగా ప్రతి సోమవారం అక్కడ స్థానిక పోలీసు స్టేషన్లో సంతకం పెట్టాలని ధర్మా సనం పేర్కొంది. ''పిటిషన్ దారున్ని మూడు రోజుల్లోపు ట్రయల్ కోర్టుకు తీసుకెళ్లాలి. కప్పన్ లేదా అతని తరపు న్యాయవాది ప్రతిరోజూ ట్రయల్ కోర్టు విచారణకు హాజరు కావాలి. కప్పన్ విడుదలకు ముందు పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయాలి. ఆయన స్వేచ్ఛను దుర్విని యోగం చేయకూడదు. వివాదంతో సంబంధం ఉన్న ఎవరితోనూ టచ్‌లో ఉండకూడదు'' అని ఆదేశాల్లో పేర్కొంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం-2002 కింద అతనిపై ప్రారంభించిన విచారణలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛ కూడా కప్పన్‌కు సుప్రీం కోర్టు ఇచ్చింది. పీఎంఎల్ఎ కేసులో బెయిల్ ఉపశమనం పొందేందుకు కప్పన్‌కు అవసరమైన మేరకు కోర్టు విధించిన బెయిల్ షరతులు సడలించ బడతాయని కోర్టు పేర్కొంది.
ఉపా కింద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసిన కేసులో ఆగస్టు 2న తన బెయిల్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ కప్పన్ సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు. మలయాళ వార్తా పోర్టల్ అజిముఖం రిపోర్టర్, కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (కేయూడబ్ల్యూజే) ఢిల్లీ యూనిట్ మాజీ కార్య దర్శి సిద్ధిక్ కప్పన్, 19 ఏండ్ల దళిత యువతి సామూహిక లైంగికదాడి, హత్య గురించి నివేదించడానికి హత్రాస్‌కు వెళుతుండగా 2020 అక్టోబర్ 6న ఉత్తరప్రదేశ్ లో మరో ముగ్గురితో పాటు ఆయనను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. వారందరిపై చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) లో సెక్షన్ 17, సెక్షన్ 18, ఐపీసీ సెక్షన్ 124ఎ (విద్రోహం), సెక్షన్ 153ఎ (మతం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వా న్ని ప్రోత్సహించడం), సెక్షన్ 295ఎ (ఉద్దేశ పూర్వకంగా మతపరమైన భావాలతో హానికర మైన చర్యలు) , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం లోని 65, 72, 75 సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. 2021 ఏప్రిల్ 2న చార్జిషీట్ దాఖలు చేశారు. జులై 2021లో కప్పన్ బెయిల్ పిటిషన్‌ను మధుర కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన అలహా బాద్ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ సింగి ల్ జడ్జి జస్టిస్ క్రిషన్ పహల్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరిం చారు. దీంతో అత్యున్నత న్యాయ స్థానంలో కప్పన్ సవాల్ చేశాడు. కప్పన్ పిటిషన్‌పై ఆగస్టు 29న సుప్రీం కోర్టు ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. కప్పన్‌కు వ్యతిరేకంగా యుపి ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై శుక్రవారం విచారించి న సుప్రీం కోర్టు ధర్మాసనం కప్పన్‌కు బెయిల్ మంజూరు చేసింది.
సుప్రీం కోర్టులో కన్నీండ్లను ఆపుకోలేక పోయా : రెహైనాత్, సిద్ధిక్ కప్పన్ భార్య
సిద్ధిక్ కప్పన్ భార్య రైహానాత్ మీడియాతో మాట్లాడుతూ ''విచారణ జరిగినప్పుడు నేను కోర్టులో ఉన్నాను. నేను విన్నదాన్ని నేను నమ్మ లేకపోయాను. నా కన్నీండ్లను ఆపుకోలేక పోయాను'' అని ఉద్వేగానికి లోనయ్యారు.
కప్పన్‌కు బెయిల్‌ను స్వాగతించిన డీయూజే
ఉపా కేసులో జర్నలిస్టు, కేరళ యూని యన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఢిల్లీ యూనిట్ మాజీ కార్యదర్శి సిద్ధిక్ కప్పన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు లను ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (డీయూ జే) స్వాగతించింది. ఈ మేరకు శుక్రవారం డీయూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్కె పాండే, సుజాత మధోక్, కార్యదర్శి ఎఎం జిగీష్ ప్రకటన విడుదల చేశారు. ఆలస్యం అయిన ప్పటికీ, ఈ బెయిల్ ఆర్డర్ చాలా స్వాగతించ దగినదని పేర్కొన్నారు. పీఎంఎల్ఏ కింద అతనిపై దాఖలైన మరో కేసులో కప్పన్‌కు కూడా బెయిల్ మంజూరు చేయబడుతుందని, అతను జైలు నుండి బయటపడతాడని ఆశిస్తు న్నామని తెలిపారు. కప్పన్‌కు న్యాయం జరిగేలా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌తో సహా కప్పన్ కుటుంబం, సహచరులు, స్నేహితులు, కేయూడబ్ల్యూజే, న్యాయవాదులు చేసిన ప్రయత్నాలను డీయూజే అభినందిస్తుంది. కప్పన్ అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో డీయూజే ముందంజలో ఉందని పేర్కొన్నారు. తనపై పెట్టిన తప్పుడు కేసులపై న్యాయ పోరాటంలో కప్పన్‌కు డీయూజే అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ రోజు అనేక బెదిరింపుల నేపథ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛను సమర్థిస్తూ బెయిల్ ఆర్డర్ చారిత్రాత్మ కమైనదని పేర్కొన్నారు.