Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైన్స్ టెక్నాలజీ రంగాల్లో ఆధునిక విధానాలు రూపొందించాలి
- సైన్స్ సదస్సును ప్రారంభిస్తూ ప్రధాని మోడీ పిలుపు
- సదస్సును బహిష్కరించిన బీహార్, జార్ఖండ్
న్యూఢిల్లీ : పరిశోధన, వినూత్న ఆవిష్కరణలకు అంతర్జాతీయ కేంద్రంగా భారతదేశాన్ని తయారుచేసేందుకు సంఘటితంగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ఆధునిక విధానాలను రూపొందించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దేశవ్యాప్తంగా పటిష్టమైన, సైన్స్, టెక్నాలజీ, ఇన్నొవేషన్ (ఎస్టీఐ) వ్యవస్థను నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని, సహకార యంత్రాంగాలను మరింత బలోపేతం చేసేందుకై ఉద్దేశించిన సైన్స్ సదస్సును శనివారం ప్రధాని మోడీ వీడియో లింక్ ద్వారా ప్రారంభిస్తూ, ''జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంథాన్'' మంత్రంతో భారత్ ముందుకు సాగుతోందని అన్నారు. ఈ 'అమృతకాలం'లో దేశాన్ని పరిశోధనా, ఆవిష్కరణల కేంద్రంగా మార్చాలంటే వివిధ రంగాల్లో మనందరం కలిసికట్టుగా కృషి చేయాల్సి వుందన్నారు. కింది స్థాయి వరకు సైన్స్, టెక్నాలజీ రంగాల్లో పరిశోధనలు సాగాలన్నారు. స్థానిక సమస్యలకు స్థానికంగానే పరిష్కారాలు కనుగొనేందుకు అన్ని రాష్ట్రాలు వినూత్న ఆవిష్కరణలపై దృష్టి కేంద్రీకరించాల్సిన తరుణమిదని పిలుపిచ్చారు. శాస్త్రవేత్తలతో మరింత సహకారం, సమన్వయం వుండాల్సిన అవసరం వుందని అన్నారు. వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి గానూ మరిన్ని శాస్త్రీయ సంస్థలను ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రాల్లో ఉన్నత విద్యా సంస్థల్లో ప్రయోగశాలల సంఖ్య కూడా పెంచాలన్నారు. గ్లోబల్ ఇన్నొవేషన్ ఇండెక్స్‌లో 2016లో 81వ స్థానంలో వున్న భారత్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 46కి ఎగబాకిందని మోడీ చెప్పారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, యువ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. అహ్మదాబాద్‌లోని సైన్స్ సిటీ ఈ సదస్సును నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సు ఈ తరహాలో జరిగే మొదటిది. డిజిటల్ హెల్త్ కేర్, రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచే సాంకేతిక ఆవిష్కరణలు, పరిశుద్ధ ఇంధనం వంటి వివిధ అంశాలపై విడివిడిగా సెషన్లు జరగనున్నాయి.
కేంద్ర కార్యక్రమాలను బహిష్కరిస్తున్న రాష్ట్రాలు
అయితే ఈ సదస్సుకు జార్ఖండ్, బీహార్ రెండు రాష్ట్రాలు హాజరు కారాదని నిర్ణయించాయి. అధికారిక కారణమేం టనేది ఇంకా తెలియరాలేదు. అయితే, కేంద్రం నిర్వ హించే కార్యక్రమాలకు రాష్ట్రాలు గైర్హాజరు కావడం ఇటీవల బాగా పెరుగుతోంది. కాగా, జార్ఖండ్, బీహార్‌ల్లో నెలకొన్న రాజకీయ అశాంతి కారణంగానే వారు ఈ సదస్సుకు హాజరు కారాదనే నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. జార్ఖండ్‌లో ముఖ్యమంత్రి బలపరీక్షలో నెగ్గినప్పటికీ మైనింగ్ లీజు విషయంలో అనర్హత ముప్పును ఎదుర్కొంటున్నారు. ఇక బీహార్ ఇటీవలే రాజకీయ తుపాను నుండి బయటపడింది. బిజెపితో తెగతెంపులు చేసుకున్న సీఎం నితీష్ కుమా ర్ ఆర్జెడి, కాంగ్రెస్, ఇతర చిన్నపార్టీలతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరో సంఘటనలో గురువారం ఇండియా గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన 28 అడుగుల నేతాజీ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరు కారాదని నిర్ణయించారు. నేను వారి సేవకు రాలినో లేదా వెట్టి పనివాడినో అన్నట్లు ఆహ్వానించా రని అందుకే తాను వెళ్లరాదని భావించానని ఆమె చెప్పారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో సమావేశమయ్చేందుకు తనను ఆహ్వానించకపోవ డం పట్ల కూడా మమత అభ్యంతరం వ్యక్తం చేశారు. నేను విదేశీ ప్రతినిధులను కలుసుకుంటే కేంద్ర ప్రభు త్వానికి ఆందోళనగా వుంటుంది. ఎందుకో తెలుసుకో వాలను కుంటున్నానని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ధోరణిని చాలాసార్లు తాను గమనించానని చెప్పారు.