Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను విడుదల చేయ డాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మాజీ ఐపీఎస్, ఐఎఫ్ఎస్ మహిళ అధికా రులు, విద్యా వేత్త పిటిషన్ దాఖలు చేశారు. మీరన్ చద్దా బోర్వాంకర్ (మాజీ ఐపీఎస్ అధికారి), మధు బాధురి (మాజీ ఐఎఫ్ఎస్ అధికారి), విద్యావేత్త జగదీప్ చొక్కర్లు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషనర్ల తరపున న్యాయవాది వృందా గ్రోవర్ పిటిషన్ దాఖలు చేశారు. బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే సీపీఐ (ఎం)పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ సుభాషిణి అలీ, టీఎంసీ ఎంపీ మహువా మెయిత్రా, జర్నలిస్టు రేవతి లాలూ, ప్రొఫెసర్ రూప్ రేఖా వర్మ త దితరులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది.