Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు వచ్చే ఐదేండ్లలో ఆరుగురు ప్రధాన న్యాయమూర్తులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 2027 వరకు సుప్రీంకోర్టు కొలీజియానికి (న్యాయమూర్తులు నియామకాలకు చేపట్టే) ఆరుగురు వేర్వేరు సీజేఐలు నేతృత్వం వహించనున్నారు. సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)తో కలిపి 34 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 30 మంది ఉన్నారు. నాలుగు న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
జసిస్ట్ యుయు లలిత్ కొలీజియంలో మహిళ సభ్యురాలు
సీజేఐ జస్టిస్ యుయు లలిత్ పదవీకాలం 2022 ఆగస్టు 27 నుంచి 2022 నవంబర్ 8 వరకు సీజేఐ అతి తక్కువ పదవీకాలం ఉండనున్నది. కేవలం 74 రోజులు మాత్రమే ఆయన పదవిలో ఉంటారు. 1971లో జస్టిస్ ఎస్ఎం సిక్రీ తరువాత నేరుగా సుప్రీం కోర్టు బార్ నుంచి సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయిన రెండో వ్యక్తిగా జస్టిస్ యుయు లలిత్ నిలిచారు. ఈయన నేతృత్వంలో ఉన్న కొలీజియంలో మహిళ న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ సభ్యురాలుగా ఉన్నారు. సుప్రీం కోర్టు చరిత్రలో కొలీజియంలో మహిళా సభ్యురాలు ఉండటం ఇది మూడోసారి మాత్రమే. అంతకు ముందు మహిళ సభ్యులు జస్టిస్ రుమా పాల్, జస్టిస్ ఆర్ భానుమతి ఉన్నారు. అయితే జస్టిస్ ఇందిరా బెనర్జీ సెప్టెంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో కొలీజియంలో మరో మహిళా సభ్యురాలు చేరడానికి మరో మూడేళ్లు పడుతుంది. బెనర్జీ పదవీ విరణ తరువాత, కొలీజియంలో న్యాయమూర్తులు జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎస్కె కౌల్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కెఎం జోసెఫ్ ఉంటారు.
చరిత్ర సృష్టించనున్న జస్టిస్ డివై చంద్రచూడ్
జస్టిస్ డివై చంద్రచూడ్ 2022 నవంబర్ 9న సుప్రీం కోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన పదవీకాలం 2022 నవంబర్ 9 నుంచి 2024 నవంబర్ 10 వరకు ఉంటుంది. ఆయన రెండేండ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. గత పదేండ్ల లో సీజేఐగా సుదీర్ఘ పదవీకాలం ఇదే అవుతుంది. డివై చంద్రచూడ్ చరిత్రను సృష్టించనున్నారు. ఎందుకంటే ఆయన తండ్రి జస్టిస్ వైవి చంద్రచూడ్ (1978 ఫిబ్రవరి 22 నుంచి 1985 జూలై 11 వరకు) 16వ సీజేఐ గా బాధ్యతలు నిర్వర్తించారు. తండ్రి, కొడుకులు సుప్రీం కోర్టు సీజేఐగా అవ్వడం ఇదే ప్రథమం అవుతుంది. 51వ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం 2024 నవంబర్ 11 నుంచి 2025 మే 13 ఉంటుంది. 52వ సీజేఐగా జస్టిస్ బిఆర్ గవారు పదవీకాలం 2025 మే 14 నుంచి 2025 నవంబర్ 23 వరకు ఉంటుంది. దాదాపు పదేండ్లలో అత్యున్నత న్యాయస్థానంలో నియమితులైన తొలి దళిత న్యాయమూర్తి ఆయనే. 2010లో పదవీ విరమణ చేసిన 37వ సీజేఐ జస్టిస్ కెజి బాలకృష్ణన్ (2007 జనవరి 14 నుంచి 2010 మే 12 వరకు) తరువా త, రెండో దళిత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవారు నిలిచారు.