Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
- 220 పిటిషన్లపై అక్టోబర్ 31న విచారణ
న్యూఢిల్లీ : పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో మతపరమైన హింసకు గురై దేశానికి వచ్చిన ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం ఇవ్వాలన్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన 220 పిటిషన్లను అక్టోబర్ 31న విచారించనున్నట్టు సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఈ అంశాన్ని త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేయనున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఎస్ఆర్ భట్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించిన 2019 సవరించిన చట్టం ప్రతిపక్ష పార్టీలు, నాయకులు, ఇతర వ్యక్తుల నుంచి తీవ్ర విమర్శలకు దారితీసింది.