Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర హోంశాఖ ప్రకటన
న్యూఢిల్లీ : విభజన సమస్యలపై ఈ నెల 27న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమావేశం ఏర్పాటుచేసింది. విభజన చట్టం షెడ్యూల్ 9, 10లోని ఆస్తుల పంపకాలపైనా భేటీలో చర్చించనున్నట్టు సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థిక పరమైన అంశాలూ చర్చకు రానున్నాయి. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజరు భల్లా నేతృత్వంలో జరిగే ఈ భేటీకి హాజరు కావాలని ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులతో పాటు రైల్వే బోర్డు చైర్మెన్ సహా వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్ర సహకారం, విద్యాసంస్థల స్థాపన, రాజధాని నుంచి ర్యాపిడ్ రైల్ అనుసంధానంపై చర్చించాలని కేంద్ర హోంశాఖ ఎజెండాలో పొందుపరిచింది. కేంద్ర ఆర్థిక శాఖతో పాటు విద్య, రైల్వే, పెట్రోలియం శాఖతో పాటు దాదాపు తొమ్మిది శాఖల అధికారులను భేటీకి ఆహ్వానించారు. ఏపి ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సంబంధించి ఇప్పటికీ కొలిక్కి రాని పరిస్థితి నెలకొంది. దీనిపై కూడా చర్చించేందుకు ఎజెండాలో పొందుపర్చారు.