Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండో సారి నియామకం
న్యూఢిల్లీ : తదుపరి అటార్నీ జనరల్ (ఏజీ)గా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ నియామకం కానున్నారు. ప్రస్తుత ఏజీ కెకె వేణుగోపాల్ సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. దేశ 14వ అటర్నీ జనరల్‌గా బాధ్యతలను ముకుల్ రోహత్గీ స్వీకరించనున్నారు. మోడీ ప్రభుత్వం రాగానే ముకుల్ రోహత్గీని ఏజీగా నియమించింది. 2014 జూన్ 19 జూన్ నుంచి 2017 జూన్ 18 వరకు తొలిసారి ముకుల్ రోహత్గీ మొదటిసారి పనిచేశారు. 2017 జూలై 1 నుంచి కెకె వేణుగోపాల్ ఆ పదవీలో కొనసాగారు. ఆయన పదవీకాలం ముగినప్పటికీ ప్రభుత్వం రెండుసార్లు పొడిగించింది. సెప్టెంబర్ 30తో ఆయన గడువు పూర్తి అవుతుంది. ఇటీవలి సుప్రీంకోర్టులో తాను సెప్టెంబర్ తరువాత తన పదవిలో ఉండకపోవచ్చని వేణుగోపాల్ తెలిపారు. దీంతో అక్టోబర్ 1 నుంచి తదుపరి ఏజీగా ముకుల్ రోహత్గీ రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు.