Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరిని సీపీఐ(ఎం) బృందం కలిసి,చర్చించింది. మంగళవారం నాడిక్కడ కేంద్ర మంత్రి కార్యాలయంలో ఆయనను సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ(ఎం) రాజ్యసభ సభ్యుడు వి.శివదాసన్, సీపీఐ(ఎం) నేతలు అశోక్ ధావలే, బి.వెంకట్, కృష్ణప్రసాద్లతో కూడిన బృందం కలిసింది. ఈ సందర్భంగా తనను సీతారాం ఏచూరి నేతృత్వంలో సీపీఐ(ఎం) బృందం కలిసిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తన ట్విట్టర్లో పేర్కొన్నారు.