Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిబ్బందికి ఇన్ఫోసిస్ హెచ్చరిక
న్యూఢిల్లీ : తమ సిబ్బంది రెండవ ఉద్యోగం చేయడానికి వీలు లేదని ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ ఉద్యోగాన్ని చేపట్టేముందు ఉద్యోగులు ఒకసారి తమ ఎంప్లారుమెంట్ కాంట్రాక్టును చదవాలని ఉద్యోగులకు పంపిన ఇ-మెయిల్లో ఆ కంపెనీ సూచించింది. పనివేళల్లో, పని వేళలు ముగిసిన తర్వాత రెండో ఉద్యోగం చేసే ఉద్యోగులను తొలగిస్తామని హెచ్చరించింది. ఉద్యోగ నిబంధనలను ఉల్లంఘిస్తే వేటు తప్పదని పేర్కొంది. రెండు ఉద్యోగాల పద్ధతి (మూన్ లైటింగ్)ని తమ కంపెనీ ఎట్టిపరిస్ధితుల్లో ఉపేక్షించదని వెల్లడించింది. ఇన్పోసిస్ అనుమతి లేకుండా ఎలాంటి ఫుల్‌టైం, పార్ట్‌టైం ఉద్యోగాన్ని ఉద్యోగి చేపట్టరాదని ఆఫర్ లెటర్, ఎంప్లారుమెంట్ కాంట్రాక్టులో స్పష్టం చేసినట్లు గుర్తు చేసింది. ఒకవేళ అలా అదనపు ఆదాయం కోసం ఏదైనా పనిచేయాలనుకుంటే దానికి కంపెనీ అనుమతి తప్పనిసరని లేఖలో పేర్కొంది. సందర్భాన్ని బట్టి నిబంధనలకు లోబడి ఉద్యోగి అభ్యర్థన అర్హమైందని భావిస్తే ప్రత్యేక అనుమతి విషయాన్ని పరిశీలించే అవకాశం ఉందని తెలిపింది. ఉద్యోగులు రెండేసి ఉద్యోగాలు చేయడంతో ఉత్పాదన, నాణ్యతపై ప్రభావం పడిందని తెలిపింది. అదే విధంగా ఉద్యోగ సామర్ధ్యం, డేటా రిస్క్, గోప్యతతో కూడిన డేటా బహిర్గతమయ్యే ముప్పునకు అవకాశాలున్నాయని పేర్కొంది. తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి నైపుణ్యం గల ఉద్యోగులకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో కొంతమంది అదనపు ఆదాయం కోసం ఖాళీ సమయంలో మరో పని చేస్తున్నారు.