Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జి-20 సమావేశాల్లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ చేసిన ప్రకటనను సీఐటీయూ తీవ్రంగా నిరసించింది. మంత్రి చేసిన ప్రకటన కేవలం 'ప్రజా సంబంధాల విన్యాసం'గా వుందని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ ఒక ప్రకటనలో విమర్శించారు. వాస్తవానికి భారత ప్రభుత్వం దీనికి పూర్తిగా భిన్నమైన రీతిలో వ్యవహరిస్తోందని అన్నారు. కోవిడ్ మహమ్మారి నుండి పూర్తిగా, సమర్ధవంతంగా కోలుకోవడానికి గానూ కార్మికుల ఉపాధి పరిస్థితులను మరింత బలోపేతం చేయాల్సి వుందని మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు. కానీ, భారత్‌లో కోవిడ్ లాక్డౌన్ సమయంలోనే లేబర్ కోడ్లను రూపొందించారని, ఇన్నేళ్ళుగా కార్మికుల కోసం అమల్లో వున్న కాస్తో కూస్తో ఉపాధి పరిస్థితులన్నీ కూడా దీనితో నాశనమవుతాయని తపన్ సేన్ విమర్శించారు.