Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. ఎగుమతు లు ఒక్క అంకె స్థాయిలో పెరిగితే.. దిగుమతులు రెండంకెల స్థాయిలో ఎగిసిపడటంతో దేశ వాణిజ్య లోటు ఊహించని స్థాయికి చేరుతోంది. దీంతో చెల్లింపుల భారం పెరగడంతో పాటుగా రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడి చోటు చేసుకోనుంది. ప్రస్తుత ఏడాది ఆగస్టులో ఎగుమతులు 1.62 శాతం పెరిగి 33.92 బిలియన్ డాలర్లకు చేరగా.. ఇదే సమయంలో దిగుమతులు ఏకంగా 37.28 శాతం ఎగిసి 61.9 బిలియన్ డాలర్లకు పెరిగాయి. దీంతో వాణిజ్యలోటు రెండింతలకు పైగా పెరిగి 27.98 బిలియన్ డాలర్లకు చేరడం ఆందోళనకరం. గతేడాది ఇదే ఆగస్టులో వాణిజ్య లోటు 11.71 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో పోల్చితే వాణిజ్య లోటు అమాంతం ఎగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టులో ఎగుమతులు 17.68 శాతం వృద్థితో 193.51 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇదే సమయంలో దిగుమతులు ఏకంగా 45.74 శాతం పెరిగి 318 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఫలితంగా వాణిజ్యలోటు 124.52 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకుంది. ఇంతక్రితం ఏడాది ఇదే కాలంలో 53.78 బిలియన్ డాలర్ల లోటు నమోదయ్యింది.