Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్ : రూ. 200కోట్ల విలువైన 40 కేజీల హెరాయిన్‌ను గుజరాత్ పోర్ట్‌లో బుధవారం ఉగ్రవాద నిరోధక స్క్వాడ్ (ఏటీఎస్) స్వాధీనం చేసుకుంది. అరేబియన్ సముద్ర తీరంలో ఓ పాకిస్తాన్ ఫిషింగ్ బోట్ నుంచి హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామనీ, ఆరుగురు పాకిస్తానీయులను అదుపులోకి తీసుకున్నామని ఏటీఎస్ ఉన్నతాధికారి తెలిపారు. గుజరాత్ తీరప్రాంతభద్రతా దళాలు, ఏటీఎస్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు. నిర్ధిష్ట సమాచారం మేరకు కచ్ జిల్లాలోని జఖౌ ఓడరేవుకు సమీపంలో హెరాయిన్‌ను తీసుకువెళుతున్న పాకిస్తాన్ ఫిషింగ్ బోటును సముద్రం మధ్యలో అడ్డగించాయని అన్నారు. నిందితులు గుజరాత్ తీరంలో సరుకును దింపి రోడ్డు మార్గం ద్వారా పంజాబ్‌కు తరలించాలని భావించారని అన్నారు. గతంలో కూడా గుజరాత్ తీరంలో మాదక ద్రవ్యాల అక్రమ తరలింపును అడ్డుకున్నామని చెప్పారు.