Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీల్డ్ కవర్ రిపోర్ట్ ఇవ్వండి
- సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జికి ఆదేశం
న్యూఢిల్లీ :గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో కర్నా టక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణ ట్రయల్ కోర్టులో 12 ఏండ్లుగా జాప్యం చేయడాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని సహించలేమని పేర్కొంది. జాప్యానికి గల కారణాలు, విచారణ దశపై సీల్డ్ కవర్ రిపోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జిని ఆదేశించింది. గనులు ఆక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో తొమ్మిది మందిపై సీబీఐ 2000లో కేసులు నమోదు చేసింది. ఈ కేసులో 2011 సెప్టెంబరు 5న గాలి జనార్దన్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసి జైలులో పెట్టింది. కర్నా టకలోని బళ్లారి, ఆంధ్రప్రదేశ్‌లోని కడప, అనంతపురం జిల్లాలకు వెళ్లవద్దనే షరతులతో సుప్రీంకోర్టు 2015 జనవరి 20న ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాలను పాటిస్తున్నందున తనపై ఉన్న బెయిల్ షరతులు సడలించాలంటూ ఆయన 2020లో మరోసారి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తుగా ఆయా జిల్లాల పోలీస్ సూపరింటెండ్లకు తెలియజేసి బళ్లారి, కడప, అనంతపురం వెళ్లవచ్చంటూ గతేడాది ఆగస్టు 19న సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. గాలి బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్‌ను జస్టిస్ ఎం.ఆర్ షా, జస్టిస్ కృష్ణమురారితో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ మాధవి దివాన్ వాదనలు వినిపించారు. విచారణ సాగకపోవ డానికి కారణాలు ఏమిటో తెలియజేస్తూ హైదరా బాద్ సీబీఐ కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి నుంచి సీల్డ్ కవర్ నివేదిక ఈనెల 13 లోపు అందజేయాలని, సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌కు పిటిషనర్ రిజాయిండర్ దాఖలు చేయొచ్చని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 20కి ధర్మాసనం వాయిదా వేసింది.
సుప్రీం కోర్టుపై విశ్వాసం సన్నగిల్లుతోంది..
సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదిపై కపిల్ సిబల్
అత్యున్నత న్యాయస్థానంపై విశ్వాసం నెమ్మదిగా సన్నగిల్లుతుందని సుప్రీం కోర్టు న్యాయవాది కపిల్ సిబల్ మరోసారి అన్నారు. సుప్రీం కోర్టుపై విశ్వాసం నెమ్మదిగా సన్నగిల్లుతుందని అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనంకు తెలిపారు. జకియా జాఫ్రీ, పిఎంఎల్ఎ కేసుల్లో తీర్పులను విమర్శిస్తూ ఆగస్టు 6న సిటిజన్స్ ట్రిబ్యునల్‌లో సుప్రీం కోర్టుపై కపిల్ సిబల్ గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. న్యాయమూర్తులు జస్టిస్ అజరు రస్తోగి, జస్టిస్ బివి నాగరత్నలతో కూడిన ధర్మాసనంలో విచారణ జరుగుతున్న సమయంలో కపిల్ సిబల్ మాట్లాడుతూ ''మీరు కూర్చున్న కుర్చీపై మాకు చాలా గౌరవం ఉన్నది. ఇది బార్ అండ్ బెంచ్ మధ్య విచ్ఛిన్నం కాని వివాహం. కానీ నాలాంటి వ్యక్తిని కలవరపెడుతుంది. న్యాయస్థానంపై విశ్వాసం సన్నగిల్లుతోంది'' అని అన్నారు. సిబల్ వ్యాఖ్యలపై జస్టిస్ రస్తోగి స్పందిస్తూ, ''మేము ఎప్పుడూ బార్ అండ్ బెంచ్ రథానికి చక్రాలు అని చెబుతాం, అయితే వాస్తవం ఏమిటంటే ఇవి రెండు చక్రాలు. ఒక చక్రం ఎక్కడికి వెళ్తుందో, మరొక చక్రం ఎక్కడికి వెళ్తుందో దేవుడికి తెలుసు. మనమందరం ఈ సంస్థ గురించి ఆందోళన చెందుతున్నాం. సామాన్య ప్రజల విశ్వాసం సన్నగిల్లకుండా ఉండే దేశంలో మనం ఎలా నిలదొక్కుకోగలుగుతున్నామో, ఎలా నిలదొక్కుకోవా లో ఆత్మపరిశీలన చేసుకోవాలని బార్కి, మాకు కూడా మా విన్నపం'' అని తెలిపారు. ''మనం ఓడినా, గెలిచినా పర్వాలేదు, ఆ సంస్థపై మనకున్న విశ్వాసమే ముఖ్యం, అది నెమ్మదిగా సన్నగిల్లుతోంది'' అని సిబల్ అన్నారు.