Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమతులు వచ్చాక నెడ్‌క్యాప్ ద్వారా అప్పగింత
అనకాపల్లి : రాష్ట్రంలోని సుమారు 6,200 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి అవకాశమున్న ఏడు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు (పిఎస్పి)లను ప్రభుత్వం అదానీకి అప్పగించనుంది. ఏడు ప్రాజెక్టు లను నిర్మించే ఆర్థిక శక్తి ఆంధ్రప్రదేశ్ నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్)కు లేనం దున అదానికి అప్పగించనున్నట్లు నెడ్‌క్యాప్ చైర్మన్ కెకె.రాజు తెలిపారు. ఇందుకు సంబంధించి నీటిపారుదల శాఖ, అటవీ శాఖ నుంచి అవసరమైన నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాలు వచ్చిన తర్వాత అదానీకి అప్పగించే ప్రక్రియ ప్రారం భం కానుంది. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లోని కడప జిల్లా గండికోట, అనంతపురంలోని చిత్రావతి, నెల్లూరు లోని సోమశిల, కర్నూలులోని అవుకు, విజయనగరం జిల్లాలోని కురుకుట్టి, కర్రివలస, విశాఖపట్నం జిల్లాలోని యర్ర వరంలో సుమారు 6200 మెగావాట్ల పునరు త్పాదక విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని నెడ్‌క్యాప్ గుర్తిం చింది. రూ.24,832.43 కోట్ల విలువైన ఏడు పవర్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే 6,200 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ అందుబాటులోకి రానుంది.