Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిరోజే టిడిపి సభ్యులపై వేటు
- సభలో బుగ్గన, పయ్యావుల వాగ్వివాదం
- స్పీకర్ పోడియం ముట్టడి
అమరావతి : శాసనసభ సమావేశాలు సస్పెన్షన్లతో ప్రారంభ మైనాయి. సమావేశాల తొలిరోజైన గురువారం నాడే 16 మంది టీడీపీ సభ్యులపై వేటు పడింది. సభా కార్యకలాపాలకు అడ్డుతగుల్తున్నందున వీరిని ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అంతముందు వాగ్వి వాదాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో సభ దద్ధరిల్లి పోయింది. సభ్యులు వ్యక్తిగతంగా దూషించుకోవ డమూ వినిపించింది. వేర్వేరు అంశాలపై టీడీపీ సభ్యులు పోడియంను పలుసార్లు చుట్టుముట్టారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. వికేంద్రీకరణపై చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లడంతో వారిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో వారు బయటకు వెళ్లిపోయారు. అంతకుముందు పరిపాలన వికేంద్రీకరణపై జరిగిన చర్చలో భాగంగా రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంశాన్ని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రస్తావించారు. 2014 డిసెంబరు 30న అమరావతి రాజధాని ఏర్పాటుకు సంబంధించి జిఓ వచ్చిందని, నవంబరులో మంత్రివర్గ సమావేశంలో తుళ్లూరు మండలంలో రాజధాని పెట్టాలని ఆమోదించారని మంత్రి బుగ్గన తెలిపారు. అయితే నవంబరుకు ముందే టీడీపీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు తుళ్లూరు, పెదకాకాని, తాడికొండ మండలాల్లో భూములు కొన్న రికార్డులను బుగ్గన చూపించారు. ఈ సందర్భంగా పయ్యావుల్ కేశవ్ పేరును ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ సంస్థ కంతేరు గ్రామంలో భారీగా భూములు కొనుగోలు చేసిందని ఆయన చెప్పారు. దీనిపై స్పందించిన కేశవ్ తాను భూములు కొనుగోలు చేసినే విషయం వాస్తమేనేని, 2014 సెప్టెంబరులో రాజధాని నిర్ణయం జరిగిందని తాను అక్టోబరులో భూములు కొనుగోలు చేసినట్లు తెలిపారు. దేశంలో ఎవరు ఎక్కడ అయినా భూములు కొనుగోలు చేసుకోవచ్చు నని అన్నారు. తాము తప్పు చేసినట్లు ప్రభుత్వం భావిస్తే సుప్రీంకోర్టులో కేసు ఎందుకు ఉపసంహ రించుకున్నారని పయ్యావుల కేశవ్‌తో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. అరిగిపోయిన టేపురికార్డు మాదిరిగా మూడేళ్ల నుంచి మంత్రి బుగ్గన ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ గురించి చెప్పిందే చెబుతున్నారని టీడీపీ సభ్యులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ అన్నారు. ఈ సమయంలో టీడీపీ సభ్యులకు, మంత్రి బుగ్గన మధ్య వాగ్వివాదం జరిగింది. తన వాదన విన్పించేందుకు మళ్లీ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని పయ్యావుల కేశవ్ కోరారు. దీనికి స్పీకర్ నిరాకరించడంతో టీడీపీ సభ్యులంతా స్పీకర్ పోడియం ముట్టడించారు. స్పీకర్‌తో వాగ్వావాదానికి దిగారు. ఈ దశలో స్పీకర్ ఆదేశాలతో సభలోకి ప్రవేశించిన మార్షల్స్ టీడీపీ సభ్యులను వారి స్థానాలలోకి పంపేందుకు ప్రయత్నించారు. స్పీకర్ రూలింగు ఇవ్వకుండా తమను తాకడానికి కూడా వీల్లేదని టీడీపీ సభ్యులు వాగ్వివాదానికి దిగారు. దీంతో పోడియంను ముట్టడించిన టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ ఆదేశాలతో మంత్రి బుగ్గన ప్రవేశపెట్టిన సస్పెన్షన్ తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీడీపీ సభ్యులు సభ నుండి బయటకు వెళ్లారు.