Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ఖేరి జిల్లాలోని లఖింపూర్ లో ఇద్దరు దళిత బాలికలను లైంగిక దాడికి పాల్పడి, హత్య చేసిన దారుణ ఘటనపై సిపిఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దుండగులను చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఉత్తరప్రదేశ్లో శాంతిభద్రతలు ఎంతగా క్షీణించిపోయాయో ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచిందని పేర్కొంది. ఈ దిగ్భ్రాంతికర దారుణ ఘటనకు మతం రంగు పులిమేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, దానివల్ల న్యాయం జరగబోదని సీపీఐ(ఎం) హెచ్చరించింది. కాగా బాధిత బాలికల కుంటుంబ సభ్యులను అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ప్రతినిధి బృందం శుక్రవారం నాడు పరామర్శించింది. న్యాయం పొందేందుకు ఐద్వా తోడుంటుందని, ధైర్యంగా ఉండాలని వారిని ఓదార్చింది.