Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9 మంది మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కురిసిన భారీ వర్షానికి గోడ కూలి తొమ్మిది మంది మరణించారు. ఈ విషాదకర సంఘటన గురువారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. భారీ వర్షాల కారణంగా గురువారం అర్ధరాత్రి లక్నోలోని దిల్కుషా ప్రాంతంలోని మిలటరీ ప్రహరీ గోడ కూలింది. దీంతో గోడ పక్కనే గుడిసెల్లో నిద్రిస్తున్న తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు నగర జాయింట్ కమిషనర్ పీయుష్ తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని ఆయన వెల్లడించారు. లక్నోలో ప్రతిఏటా సెప్టెంబర్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. అయితే ఈ సంవత్సరం నెలరోజుల్లో కురవాల్సిన వర్షపాతం గురువారం ఒక్కరోజే నమోదైందని పీయుష్ వెల్లడించారు. సాధారణంగా సెప్టెంబర్ నెలలో 197 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవు తుంది. కానీ నిన్న ఒక్కరోజే 155 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఆయన అన్నారు. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయని పీయుష్ తెలిపారు.