Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షిల్లాంగ్ : కేసినోల ఏర్పాటు ప్రతిపాదనపై మేఘాలయ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. గ్యాంబ్లింగ్‌కు చట్టబద్ధత కల్పించడం సమాజాన్ని నైతికంగా ప్రభావితం చేస్తుందంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని చర్చి సహా పలు సామాజిక సంస్థలు వ్యతిరేకించాయి. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ప్రజల ఆందోళనల దృష్ట్యా కేసినోలకు సంబంధించిన తదుపరి చర్యలను నిలిపివేయనున్నామని ప్రకటించింది. ప్రజల మద్దతు లేకుండా తదుపరి చర్యలు తీసుకోబోమని ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా ప్రకటించారు. మేఘాలయ రెగ్యులేషన్ ఆఫ్ గేమింగ్ యాక్ట్ అండ్ రూల్స్ 2021 రద్దు చేయబడదని, చట్టంలోని నిబంధనల ద్వారా ప్రభుత్వం ఏటా రూ. 500 కోట్ల ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. ఆన్లైన్ గ్యాంబ్లిం గ్, జాక్‌పాట్ పార్లర్లపై కూడా ఆందోళనలు వస్తున్నాయని అన్నారు.