Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెల్లూరు, చెన్నై, ఢిల్లీ నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు
- ఢిల్లీ లిక్కర్ పాలసీ అవకతవకలపై దేశవ్యాప్తంగా 43 ప్రాంతాల్లో సోదాలు
న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీ అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దేశవ్యాప్తంగా 43 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రాష్ట్రానికి చెందిన వైసిపి ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసులు, కార్యాలయాల్లో కూడా సోదాలు జరిగాయి. ఏపీలో నెల్లూరు, తమిళనాడులోని చెన్నై, ఢిల్టోని ని లోథిరోడ్లోని ఆయన నివాసాల్లోనూ, కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. అలాగే చెన్నైలో ఆయనకు చెందిన కంపెనీలో కూడా సోదాలు నిర్వహించినట్లు సమాచారం.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై బీజేపీని 'స్టింగ్ ఆపరేషన్' ఆధారంగా శుక్రవారం ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఏపీలోని నెల్లూరు లో మద్యం వ్యాపారులు, పంపిణీ దారులు, సరఫరా నెట్వర్క్లకు సంబంధించిన ప్రదేశాల్లో సోదాలు జరిగాయి. హైదరాబాదులోని రాయదుర్గం సహా 26 ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఢిల్లీకి చెందిన ఈడి అధికారుల ఆధ్వర్యం లో 25 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ అవకతవకలపై ఈడీ ఇప్పటికే రెండు సార్లు సోదాలు నిర్వహించింది. దర్యాప్తు సంస్థ గత వారం ఢిల్లీ, తెలంగాణ, మహా రాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, కర్నాటకలోని 45 చోట్ల ఈ కేసులో పేరున్న ప్రయి వేట్ వ్యక్తులపై దాడులు చేయడంతో పాటు సోదాలు చేసింది. కోకాపేట్ లోని రామచంద్ర పిల్లై నివాసం, నానక్ రామ్ గూడలోని రాబిన్ డిస్టిలరీస్ కార్యాలయాల్లో ఈడి సోదాలు నిర్వహించింది. రాబిన్ డిస్టిలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పి పేరుతో రామచంద్ర పిళ్లై కంపెనీలు నిర్వహిస్తున్నారు.
ఈ కేసులో సీబీఐ ఆగస్టు 19న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఐఎఎస్ అధికారి, ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమిషనర్ అరవ గోపి కృష్ణ నివాసాలతో పాటు ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 19 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. అయితే ఈ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చిన తరువాత, ఢిల్లీ ప్రభుత్వం దీన్ని ఉప సంహరించుకుంది.