Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్: గుజరాత్లో ప్రముఖ దళిత నాయకుడు, ఆ రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జిగేశ్ మేవానీకి అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు జైలుశిక్ష విధించింది. 2016లో ఆందోళన కార్యక్రమంలో భాగంగా రహదారిని దిగ్బంధించడంతో నమోదైన కేసులో మేవానీతో మరో 19మందికి సాధారణ జైలు శిక్ష విధించింది. గుజరాత్ యూనివర్సిటీలో లా భవన్ బిల్డింగ్‌కు బాబాసాహెబ్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ మేవానీ, అతని సన్నిహితులు అప్పట్లో రోడ్డును దిగ్బంధించి ఆందోళన చేపట్టారు. ఈ వ్యవహారంలో 20మందిని అరెస్టు చేసిన పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. వీరిలో ఒకరు మృతిచెందగా.. 19 మందికి సాధారణ జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.అలాగే, వీరికి జరిమానా కూడా విధించిన జడ్జి.. ఈ తీర్పుపై అప్పీల్ చేసుకొనేందుకు వీలు కల్పిస్తూ అక్టోబర్ 17వరకు శిక్షను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, ఈ తీర్పుపై మేవానీ ట్విటర్ స్పందించారు. గుజరాత్ వర్సిటీలో కానూన్ భవన్ పేరును బాబా సాహెబ్ అంబేడ్కర్ భవన్‌గా మార్చాలనే డిమాండ్‌తో రహదారిని దిగ్బంధించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఆందోళనకారులను శిక్షిస్తున్నారు.. లైంగికదాడి దోషులను విడుదల చేస్తున్నారంటూ మేవానీ ట్వీట్ చేశారు.