Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు ఆదాయం రెట్టింపు దిశగా వేగంగా అడుగులు
- 'వ్యవసాయ ఉత్పత్తుల్లో' ప్రతి ఇంటినీ భాగస్వామ్యం చేయటమే లక్ష్యం
న్యూఢిల్లీ : వ్యవసాయ ఉత్పాతదక పెంచటం, రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యం దిశగా కేరళ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం చేపట్టిన 'వాల్యూ యాడెడ్ అగ్రికల్చర్ మిషన్' (వామ్)కు ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రైతు ఆదాయం రెట్టింపు, రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పాదకత పెంచటం ఈ మిషన్ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ మిషన్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, బ్రాండింగ్‌తో ప్రత్యేక ఆహారాన్ని విక్రయించబోతున్నారు. వీటిని అంతర్జాతీయ మార్కెట్‌కు చేర్చేందుకు ఈ మిషన్ కొత్త మార్గాల్ని అన్వేషిస్తుంది. స్థానిక స్వపరిపాలన, పరిశ్రమలు, జలవనరుల శాఖలు ఈ మిషన్ అమలుకు కసరత్తు ప్రారంభించాయి. అగ్రి ప్రొడక్ట్స్‌లో ప్రతి ఇంటినీ భాగస్వామ్యం చేయటం, ఇలా సేకరించిన వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లటం 'వామ్' ముఖ్య ఉద్దేశం. మూడో పార్టీ లేదా దళారి వ్యవస్థకు రైతులు తమ అగ్రి ప్రొడక్ట్స్‌ను అమ్ముకునే పరిస్థితి రాకుండా, 'వామ్'ను తీసుకురాబోతున్నట్టు ప్రభుత్వ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దళారి వ్యవస్థకు ముగింపు పలుకుతూ రైతుల నుంచి నేరుగా 'అగ్రి ప్రొడక్ట్స్'ను సేకరించడానికి పకడ్బంధీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'మనం..వ్యవసాయ వైపు' కార్యక్రమంలో 'వామ్' కీలక మలుపు కానున్నది. ఈ మిషన్ ద్వారా కేరళ రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ గోలుసును అభివృద్ధి చేయనున్నారు.
నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు
సాంకేతిక అభివృద్ధిని ఉపయోగించుకొని, ప్రత్యేక ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచటం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ తలెత్తే కీలక సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేస్తున్నారు. వాల్యూ యాడెడ్తో జరిగిన ఉత్పత్తుల సేకరణ, వాటి నియంత్రణ, బ్రాండింగ్, లేబులింగ్ అంతా కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే 'వామ్' చూసుకుంటుంది. ఈ మిషన్ అమల్లో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు నాలెడ్జ్ వేదికను ఏర్పాటు చేయాలని రాష్ట్రమంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో వివిధ రంగాల్ని అభివృద్ధి దిశగా నడిపించటంపై ఎల్డీఎఫ్-1 దృష్టిసారించింది. వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించింది. గతంతో పోలిస్తే కేరళలో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా (2019-20లో) 8శాతం నుంచి 9.44శాతానికి పెరిగింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తూ 'వామ్'ను ఏర్పాటుచేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.5కోట్లు కేటాయించింది. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద రూ.100కోట్లతో మార్కెటింగ్ కంపెనీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.