Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కునో నేషనల్ పార్క్‌లోకి 8 చిరుతల విడుదల
మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో శనివారం 8 చిరుత పులులను ప్రధాని నరేంద్ర మోడీ విడిచిపెట్టారు. ప్రధాని మోడీ మొదటి ఎన్‌క్లోజర్ నుంచి రెండు చిరుతలను విడిచిపెట్టారు. ఆ తర్వాత 70 మీటర్ల దూరంలో రెండో ఎన్‌క్లోజర్ నుంచి మరొక చిరుతను విడిచిపెట్టారు. ఇంటర్-కాంటినెంటల్ చీతా ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా నమీబియా నుంచి 8 చిరుతలను గ్వాలియర్‌కు కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌లో తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టుతో దాదాపు 74ఏండ్ల తర్వాత భారత్‌లోకి మళ్లీ చిరుత పులులు ప్రవే శించాయి. మహారాజ్‌పుర వైమానిక స్థావరంలో దిగిన ఈ చీతాలకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు. అనంతరం ఈ చీతాలను భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక హెలి కాప్టర్లో కునో నేషనల్ పార్క్‌కు తీసుకొచ్చారు. శాటిలైట్ ద్వారా పర్యవేక్షిం చేందుకు అన్ని చీతాలకు రేడియో కాలర్లను ఏర్పాటు చేశారు. ప్రతి చిరుత వెనుక ఒక ప్రత్యేక పర్యవేక్షణ బృందం ఉంటుంది. వారు 24 గంటల పాటు చిరుతల స్థానాన్ని పర్యవేక్షిస్తారు. ఈ ఏడాది ప్రారంభంలో సంతకం చేసిన ఎంఓయూ కింద చీతాలను తీసుకొచ్చారు. 4 నుంచి 6 ఏళ్ల వయసున్న ఐదు ఆడ, మూడు మగ చీతాలను నేడు పార్క్‌లో విడుదల చేశారు. అనంతరం మోడీయే స్వయంగా కెమెరా చేతపట్టి వాటి ఫొటోలు తీశారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఉన్నారు.