Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జార్ఖండ్ : జార్ఖండ్‌లో లోన్ రికవరీ ఏజెంట్లు దారుణానికి పాల్పడ్డారు. గర్భిణిపై ట్రాక్టర్ ఎక్కించి ఆమె మృతికి కారణమయ్యారు. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. హజారీబాగ్ ఎస్పి మనోజ్ రతన్ చోథే తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు తండ్రి ఓ ప్రముఖ ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ తీసుకొని ట్రాక్టర్ కొనుగోలు చేశారు. వాయిదాలు చెల్లించకపోవడంతో ఏజెంట్లు ట్రాక్టర్‌ను స్వాధీనం చేసు కోవాలని రైతుకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో ఇంటిదగ్గర ఉన్న రైతు కుమార్తెకు, ఏజెంట్లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆమెను పక్కకు తోసేసి రికవరీ ఏజెంట్లు ట్రాక్టర్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. సదరు మహిళ అడ్డు రావడంతో ఆమెపైకి ట్రాక్టర్ ఎక్కించారు. తీవ్ర గాయాల పాలైన గర్భిణిని బంధువులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేశామని ఎస్పి తెలిపారు. ట్రాక్టర్ రికవరీ కోసం బాధితుడి నివాసానికి వెళ్లే ముందు ఫైనాన్స్ కంపెనీ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు కూడా సమాచారం ఇవ్వలేదని పోలీసు అధికారి తెలిపారు.