Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గాంధీనగర్ : గుజరాత్లో ఓటమి భయంతో బీజేపీ.. ఆప్‌ను అణచివేసేందుకు యత్నిస్తోందని ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఆదివారం నిర్వహించిన ఆమ్ ఆద్మీ పార్టీ మొదటి జాతీయ సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడారు. ఆప్‌ను అణచివేసేందుకు బీజేపీ రెండవ దశ ఆపరేషన్ కమలం ప్రారంభించిందని.. దాని ఫలితమే ఆప్‌పై అవినీతి ఆరోపణలని దుయ్యబట్టారు. పంజాబ్, ఢిల్లీల్లో ఆపరేషన్ కమలం విఫలమైందని, దీంతో ఇప్పుడు సరికొత్త ప్రయత్నాలను ప్రారంభించిందన్నారు. గుజరాత్లో ఆప్‌కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీజేపీకి మింగుడు పడటం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంతగా భయపడుతుందంటే.. ప్రధాని సలహాదారు హిరేన్ జోషి గుజరాత్లో ఆప్ పార్టీకిమీడియా కవరేజ్ ఇవ్వవద్దని పలు టివి ఛానెళ్ల యజమానులను, ఎడిటర్లను హెచ్చరించారని అన్నారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని వారిని బెదిరించారని అన్నారు. ఇకనైనా ఇలాంటి చర్యలను నిలిపివేయాలని ప్రధాని, హిరేన్ జోషిలకు సూచించారు. .. టీవీ ఛానెళ్ల ఎడిటర్లు హీరేన్ జోషి స్క్రీన్ షాట్లని మీడియాలో పోస్ట్ చేస్తే.. ప్రధాని, జోషిల ముఖాలను దేశానికి చూపించలేరని ఎద్దేవా చేశారు. గుజరాత్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరతామని ధీమా వ్యక్తం చేశారు.