Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకిచ్చే ప్రయోజనాలకు స్వస్తి
మోడీ ప్రధాని అయ్యాక... వివిధ పేర్లతో కేంద్ర పథకాలు తెరపైకి వస్తున్నాయి. ఉన్న పథకాలకు పేర్లు మార్చినవి కొన్నైతే.. మరి కొన్ని పథకాలు భేషుగ్గా కనిపిస్తున్నా.. దీని వెనుక మర్మం ఏమిటో సునితంగా పరిశీలిస్తే అర్థమవుతుంది. అచ్చం ఇపుడు బీజేపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన పథకమే పీఎం ప్రణామ్. అన్నదాతలకిచ్చే సబ్సిడీకి మంగళం పాడటానికి కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- తెరపైకి పీఎం ప్రణామ్ : రైతు సంఘాలు
న్యూఢిల్లీ : రైతు భూమినే నమ్ముకుంటాడు. ఖరీఫ్, రబీ సీజన్లలో పండించటానికి అవసరమైన ఎరువులు, నాట్లు, ఇలా మరెన్నో వాటికి అప్పో సొప్పో చేసి పెట్టుబడి పెడుతుంటాడు. అయితే సకాలంలో ఎరువులు అందక రైతులు నకిలీ ఎరువులు, మందులు కొని నిట్టనిలువునా మునిగిపోతున్నారు. అప్పులు తీర్చలేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలపై ఎన్సీఆర్బీ నివేదిక సైతం ధ్రువీకరించింది. ఇలాంటి పరిస్థితుల్లో పీఎం ప్రణామ్ అనే పథకాన్ని రైతు ఉద్ధరణ కోసమేనంటోంది కేంద్రం.
ప్రధానమంత్రి ప్రణామ్ యోజన అంటే ఏమిటి?
గత ఐదేండ్లలో మొత్తం ఎరువుల వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. రాష్ట్రానికి సబ్సిడీ పొదుపులో 50 శాతం డబ్బు ఆదా చేసే గ్రాంట్‌గా ఇచ్చే ప్రధానమంత్రి ప్రణామ్ యోజనను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో 70 శాతం ఆస్తులను రాష్ట్రం జిల్లా స్థాయిలో, బ్లాక్‌లు , గ్రామాల్లోని ప్రత్యామ్నాయ ఎరువుల ఉత్పత్తి యూనిట్లలో ప్రత్యామ్నాయ ఎరువుల సృష్టి , సాంకేతికతను స్వీకరించడానికి ఉపయోగించాలి.
బాధ్యతల నుంచి తప్పించుకోవటమే..
మిగిలిన 30 శాతాన్ని రాష్ట్రాలు రైతులు, పంచాయతీలు, రైతు ఉత్పత్తి సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, అవగాహన కల్పించడం, ఎరువుల వినియోగాన్ని తగ్గించడంలో నిమగమవ్వాలి. అందుకు ప్రోత్సాహం కింద ఉపయోగించుకోవచ్చని కేంద్రం అంటోంది.
ఇప్పటికే వ్యవసాయనిర్వహణపై రైతులకు అవగాహన సదస్సులు
వ్యవసాయంలో మెళుకువలు, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించే అంశాలపై రైతులకు ఆయా రాష్ట్రాల్లో అవగాహన సదస్సులు, క్షేత్ర స్థాయిలో ఆచరణలు కొనసాగుతున్నాయి. ఇపుడు మళ్లీ కేంద్రం జోక్యం చేసుకునేలా వ్యవసాయ నిర్వహణ కోసం పీఎం ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ న్యూట్రియంట్స్ లేదా పీఎం ప్రణామ్ అనే పథకాన్ని ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది.
సబ్సిడీల భారాన్ని తగ్గించుకోవటానికి...
ప్రతిపాదిత పథకం రసాయన ఎరువులపై కేంద్రం నెత్తిన సబ్సిడీ భారం పడుతోందని అంచనా కొచ్చింది. ఇటీవల బడ్జెట్ ఎరువులకోసం అదనంగా కేటాయించి లక్ష కోట్లు తమ ఖజానాలోనే ఉంచుకునేలా వ్యూహం పన్నుతోందన్న చర్చ రైతు సంఘాల్లో వినిపిస్తోంది. కానీ, దీని వెనక మర్మం మరోలా ఉన్నా, రైతు నెత్తిమీద భారాన్ని తగ్గించడంలో ప్రభుత్వానికి సహాయపడుతుందనీ బీజేపీ ప్రభుత్వం చిత్రీకరిస్తోంది. ఎరువులపై సబ్సిడీ గత ఏడాది రూ. 1.62 లక్షల కోట్ల నుంచి 2022-23లో 39 శాతం పెరిగి రూ. 2.25 లక్షల కోట్లకు చేరుతుందని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.
మూడేండ్ల సగటుతో పోల్చి...
రాష్ట్రంలో ఒక ఏడాదిలో రసాయన ఎరువుల వినియోగం పెరిగినా, తగ్గినదానిని గత మూడేండ్లలో సగటు వినియోగంతో ప్రభుత్వం పోల్చి చూస్తుంది. డేటాను సరిపోల్చడానికి ప్రభుత్వం ఎరువుల మంత్రిత్వ శాఖ యొక్క (ఐఎఫ్ఎంఎస్) డ్యాష్‌బోర్డ్‌ను ఉపయోగిస్తుంది.
ప్రధానమంత్రి ప్రాణం యోజనకు ప్రత్యేక బడ్జెట్ ఉండదు. వివిధ పథకాల కింద ఎరువుల శాఖ అందించే ''ఇప్పటికే ఉన్న ఎరువుల సబ్సిడీని ఆదా చేయడం'' ద్వారా దీనికి నిధులు సమకూరుతాయి.
ఇది ఎందుకు అవసరం?
ఐదేండ్లలో, యూరియా, ఎంఓపీ (మ్యూరేట్ ఆఫ్ పొటాష్), డీఏపీ (డి-అమ్మోనియం ఫాస్ఫేట్) ఎన్పీకే(నత్రజని, ఫాస్పరస్ , పొటాషియం) నాలుగు ఎరువుల అవసరం 2017లో 528.86 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 21 శాతం పెరిగింది. -18. 2021-22లో 640.27 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ), రసాయనాలు అవసరమని ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుబా ఆగస్టు 5న లోక్‌సభకు తెలియజేశారు.
డీఏపీ 2017-18లో 98.77 ఎల్ఎంటీ నుంచి 2021-22లో 123.9 ఎల్‌ఎంటికి గరిష్టంగా 25.44 శాతం వద్ధిని నమోదు చేసింది. భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే రసాయన ఎరువులు యూరియా, ఇది 2017-18లో 298 ఎల్ఎంటీ నుంచి 2021-22లో 356.53కి 19.64 శాతం వద్ధిని నమోదు చేసింది.
ధరల పెరుగుదలతో...
అంతర్జాతీయ ఎరువుల ధరల పెరుగుదల కారణంగా పెరిగిన ధరల నుంచి రైతులను రక్షించ డానికి ప్రభుత్వం రాయితీలు అందిస్తుంది. మే నెల లో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఏడాది రూ.1.10 లక్షల కోట్ల అదనపు ఎరువుల సబ్సిడీని ప్రకటించింది.
''ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరుగుతు న్నప్పటికీ, మేము మా రైతులను అటువంటి ధరల పెరుగుదల నుంచి రక్షించాము. బడ్జెట్లో రూ. 1.05 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీతో పాటు, మా రైతులను మరింత ఆదుకోవడానికి అదనంగా రూ. 1.10 లక్షల కోట్లు అందించబడుతోంది.'' ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఉటంకించారు.
అధికారిక రికార్డుల ప్రకారం, ప్రభుత్వం 2021-22 కేంద్ర బడ్జెట్లో ఎరువుల సబ్సిడీగా రూ.79,530 కోట్లు కేటాయించింది, ఇది సవరించిన అంచనాలో రూ.1.40 లక్షల కోట్లకు పెరిగింది. 2021-22లో తుది సంఖ్య రూ. 1.62 లక్షల కోట్లకు చేరుకుంది. 2022-23లో ప్రభుత్వం రూ.1.05 లక్షల కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. అయితే ఈ ఏడాదిలో సబ్సిడీ సంఖ్య రూ.2.25 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని ఎరువుల మంత్రి తెలిపారు.
పథకం యొక్క ప్రస్తుత స్థితి
సెప్టెంబర్ 7న రబీ ప్రచారం కోసం వ్యవసాయంపై జాతీయ సదస్సు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వివరాలను చర్చించారు. ప్రతిపాదిత పథకం లక్షణాలపై కేంద్రం రాష్ట్రాల నుంచి సూచనలను కోరింది.
దీనితో పాటు, మంత్రిత్వ శాఖ ప్రతిపాదిత ప్రణాళికపై మంత్రిత్వ శాఖల మధ్య చర్చను కూడా ప్రారంభించింది. సంబంధిత శాఖల అభిప్రాయాలను పొందుపరిచిన తర్వాత ప్రధానమంత్రి ప్రణామ్ పథకం ముసాయిదాను ఖరారు చేస్తారు.మొత్తం మీద రైతుల నోట్లో మట్టి కొట్టడానికే కొత్త పథకం అని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.