Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగు ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థల బేరం
న్యూఢిల్లీ : ఇటీవలి ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియాను టాటా కంపెనీకు అప్పగించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు అనుబంధ సంస్థల అమ్మకానికి యత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నాలుగు ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థల విక్రయానికి సంబంధించిన పనులను ప్రారంభించింది. ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థల ప్రతిపాదిత విక్రయానికి బర్డ్ గ్రూప్, సెలెబి ఏవియేషన్, ఐ స్క్వేర్డ్ క్యాపిటల్‌తో సహా వివిధ బిడ్డర్లతో చర్చల కోసం రోడ్ షోలతో ప్రభుత్వం విక్రయ ప్రక్రియను ప్రారంభించింది.
''మాకు కాబోయే బిడ్డర్లతో రోడ్‌షోలు జరుగుతున్నాయి. అన్ని అనుబంధ సంస్థలను విక్రయించడానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం ఉన్నది'' అని ఒక అధికారి తెలిపారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియాకు అనుబంధంగా ఎయిర్ ఇండియా ఎయిర్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎఐఎఎస్ఎల్), అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్ (ఎఎఎఎల్), ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎఐఈఎస్ఎల్), హౌటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సీఎల్) నాలుగు సంస్థలతో పాటు వీటితో పాటు ఇతర నాన్ కోర్ అస్సెట్స్ కూడా ఎయిర్ ఇండియాకు ఉన్నాయి. ఎయిర్ ఇండియా విక్రయించినప్పటికీ, ఆ నాలుగు సంస్థలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి. వీటిని విక్రయించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే ఇవేవీ టాటా గ్రూప్ ఒప్పందంలో భాగంగా లేవు. ఇందులో సుమారు రూ. 15,000 కోట్ల విలువైన ఈ అనుబంధ సంస్థలు, నాన్-కోర్ ఆస్తులను స్పెషల్ పర్పస్ వెహికల్ అయిన ఎయిరిండియా అస్సెట్ హౌల్డింగ్ లిమిటెడ్ (ఎఐఎహెచ్ఎల్)కు ఇప్పటికే బదిలీ చేశారు. ఎయిరిండియాకు మొత్తం రూ.61,562 కోట్ల మేర అప్పులు ఉండగా, రూ.15,300 కోట్ల బాధ్యత టాటా గ్రూప్ తీసుకున్నది. మిగిలిన రూ.46 వేల కోట్ల రుణ భారం ఎఐఎహెచ్ఎల్ కింద ఉన్నది. ఈ క్రమంలోనే ఎయిరిండియా అనుబంధ సంస్థలను, నాన్ కోర్ ఆస్తులను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బర్డ్ గ్రూప్, సెలెబి ఏవియేషన్, ఐ స్క్వేర్డ్ క్యాపిటల్‌లు ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎఐఏటీఎస్ఎల్)ని స్వాధీనం చేసుకోవడానికి ఆసక్తిని కనబరిచినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ''మేం కొంతకాలంగా బర్డ్ గ్రూప్‌తో కమ్యూనికేట్ చేస్తున్నాం. అనుబంధ సంస్థలు, సెట్-ఆఫ్ లయబిలిటీలను వీలైనంత త్వరగా మోనటైజ్ చేయడమే మా ప్రణాళిక. బకాయిలు పెరుగుతున్నాయి. రుణాన్ని పెరుగుతుంది'' అని ఒక అధికారి తెలిపారు. బర్డ్ గ్రూప్ ఢిల్లీలో ఉన్న అతిపెద్ద థర్డ్ పార్టీ గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీలలో ఒకటి. సెలెబి ఏవియేషన్ హౌల్డింగ్ టర్కీకి చెందిన గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ. ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్‌పై దృష్టి సారించే ప్రైవేట్ ఈక్విటీ సంస్థ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈ) డిజిన్వెస్ట్‌మెంట్ నుంచి రూ.65,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు దాదాపు రూ.25,000 కోట్లు సమీకరించింది.
17 నెలల్లో 100 మినరల్ బ్లాక్‌ల వేలం..
కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ వెల్లడి
రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 2021 నుంచి ఆగస్టు 2022 మధ్యకాలంలో 100 మినరల్ బ్లాక్‌లను వేలం వేసినట్టు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా 2015 నుండి దేశంలో మొత్తం 208 ఖనిజ బ్లాకులను వేలం వేసింది. దీంతో దేశంలో వాణిజ్య మైనింగ్ ముందుకు సాగిందని తెలిపింది. ఇటీవలి కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ఖనిజాల అన్వేషణలో మరింత మంది ప్రయి వేట్ పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. డ్రోన్లు, ఇతర అత్యాధునిక సాంకేతికతలను మెరుగుపరచడంతో ప్రతికూల పర్యావరణ ప్రభావం లేకుండా ఖనిజ అన్వేషణ నిర్వహించబడుతుందని ఆయన అన్నారు.