Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో లైంగికదాడి బాధితురాలు మృతి
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో రోజుకో దారుణం వెలుగులోకి వస్తోంది. దళితులపై దాడులు, బాలికలపై ఉన్మాదుల ఘాతుకాలకు అడ్డుఅదుపూ లేకుండా పోయింది. అమానవీయ ఘటనలు జరుగుతున్నా అక్కడి యోగి సర్కార్‌లో కదలిక మాత్రం రావటం లేదు. బీజేపీ ప్రభుత్వం, పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఘోరాలు, నేరాలకు అడ్డుకట్ట వేయటం లేదు. సెప్టెంబర్ 7న సామూహిక లైంగికదాడికి గురైన 16ఏండ్ల దళిత బాలిక.. 12రోజులుగా ప్రాణాలతో పోరాడి సోమవారం తుదిశ్వాస విడిచింది. పిలిభిత్ జిల్లాలోని కున్వర్‌పూర్ గ్రామంలో ఆ బాలికపై రాజ్వీర్ (19), తరుణ్‌కుమార్ (25) అనే ఇద్దరు యువకులు లైంగికదాడికి తెగబడటమే గాక, డీజిల్ పోసి ఆమెకు నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన బాలికను గ్రామస్తులు లక్నోలోని హాస్పిటల్‌కు తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ఆ బాలిక హాస్పిటల్లో గత 12రోజులుగా మృత్యువుతో పోరాడింది. బాలికను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. కేసు నమోదుచేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇటీవల యూపీలోని లఖింపూర్ ఖేరీలో జరిగిన జంట హత్యలు దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి.