Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఛండీగడ్ : ఈ నెల 22న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ఆ రోజున అసెంబ్లీని ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సోమవారం ప్రకటించారు. గత కొన్ని రోజుల నుంచి ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ విశ్వాస పరీక్షను నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు. ఈ ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రజలను డబ్బుతో కొనడానికి ప్రయత్నించినా ప్రజలు తమవైపే ఉన్నారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 'ప్రపంచంలో ఏ కరెన్సీలో కూడా ప్రజల విశ్వాసానికి విలువ కట్టలేం. ఈ నెల 22న పంజాబ్ విధాన సభ ప్రత్యేక సమావేశంలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాం. విప్లవం చిరకాలం వర్థిల్లాలి' అని ట్వీట్లో తెలిపారు.